Nara Rohith: మరో ప్రయోగం చేయనున్న నారా రోహిత్‌.. ఈసారి 1970లో జరిగిన యుద్ధం నేపథ్యంలో..

Nara Rohith New Movie: సినిమా సినిమాకు తనలోని కొత్త వేరియేషన్స్‌ను చూపిస్తూ దూసుకెళుతున్నాడు యంగ్‌ హీరో నారా రోహిత్‌. కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన 'బాణం' నుంచి చివరిగా నటించిన 'వీర భోగ వసంత రాయలు' వరకు...

Nara Rohith: మరో ప్రయోగం చేయనున్న నారా రోహిత్‌.. ఈసారి 1970లో జరిగిన యుద్ధం నేపథ్యంలో..

Updated on: Feb 15, 2021 | 9:32 AM

Nara Rohith New Movie: సినిమా సినిమాకు తనలోని కొత్త వేరియేషన్స్‌ను చూపిస్తూ దూసుకెళుతున్నాడు యంగ్‌ హీరో నారా రోహిత్‌. కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన ‘బాణం’ నుంచి చివరిగా నటించిన ‘వీర భోగ వసంత రాయలు’ వరకు కొత్తకొత్త ప్రయోగాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
కమర్షియల్‌ చిత్రాల్లోనే సరికొత్త పంథాను చూపిస్తూ వస్తోన్న నారా రోహిత్‌ తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఈసారి 1970లో జరిగిన, పెద్దగా ప్రపంచానికి తెలియని ఓ యుద్ధం నేపథ్యంగా సాగనున్న సినిమాలో నటించనున్నాడు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన చైతన్య దంతులూరితో ఈ సినిమాను చేయనున్నాడు రోహిత్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రోహిత్‌ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో రోహిత్‌ పొడవాటి తెల్ల గడ్డంతో ఉండనున్నాడని సమాచారం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇక ఈ చిత్రానికి ‘అనగనగా దక్షిణాదిలో’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తోంది. ఈ లెక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో 1970 సమయంలో జరిగిన ఓ యుద్ధం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో రోహిత్‌ ఎలాంటి విజయాన్ని అందకుంటాడో చూడాలి. ఇక నారా రోహిత్ ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.

Also Read: వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి