Shyam Singha Roy: అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే “శ్యామ్ సింగ రాయ్”.. ఆకట్టుకుంటున్న టీజర్..

|

Nov 18, 2021 | 10:40 AM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Shyam Singha Roy: అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ రాయ్.. ఆకట్టుకుంటున్న టీజర్..
Nani
Follow us on

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్  సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అడిగే అండ లేదు కలబడే కండలేదు రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు.. కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ రాయ్ అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాయి పల్లవి రోల్ చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు అతీత శక్తులు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక వి, టక్ జగదీష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. పైగా రెండు సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలయ్యాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా మాత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దాంతో నాని ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.