Tuck Jagadish Twitter Review: ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని టక్ జగదీష్.. సినిమా ఎలా ఉందంటే..

|

Sep 10, 2021 | 12:18 PM

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌‌గా తెలుగమ్మాయి రీతువర్మ నటించింది.

Tuck Jagadish Twitter Review: ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని టక్ జగదీష్.. సినిమా ఎలా ఉందంటే..
Nani
Follow us on

Tuck Jagadish Twitter Review: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌‌గా తెలుగమ్మాయి రీతువర్మ నటించింది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటైనర్‌గా రూపొందింది. ఇక టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా వినాయక చవితి కానుకగా నేడు (సెప్టెంబర్ 10న) విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా టక్ జగదీష్ సినిమా అందుబాటులో ఉంది. టక్ జగదీష్ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు.

జగదీష్ (నాని) భూదేవిపురం అనే గ్రామానికి పెద్దగా ఉన్న ఆదిశేషయ్య నాయుడికి(నాజర్ ) రెండో భార్య చిన్న కొడుకు. అతను.. తన అన్నయ్య బోస్ (జగపతిబాబు).. తమ సవతి తల్లి కూతుళ్లతో సంతోషంగా కలిసి ఉంటారు. తన తదనంతరం కూడా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలన్నది ఆదిశేషయ్య కోరిక. కానీ ఆయన మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. కుటంబంలో విబేధాలు తలెత్తి చెల్లాచెదురు అవుతుంది. అసలు ఆ కుటుంబంలో విబేధాలు రావడానికి కారణం ఏంటి. చివరకు అందరు కలిశారా..?  హీరో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.? అన్నది మిగిలిన కథ.  కథ ఎలాంటిదైనా తన వంతుగా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి చూసే నాని.. ‘టక్ జగదీష్’లోనూ అదే చేశాడు. ఏ సన్నివేశంలోనూ నాని నిరాశ పరచలేదు అంటున్నారు ప్రేక్షకులు. సినిమా ఎలా ఉందో  వాళ్ళమాటలోనే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Actor: ఈ ఫోటోలోని వ్యక్తి టాలీవుడ్‌లో చాలా ఫేమస్ ఆర్టిస్ట్.. హీరోగా కూడా చేశారు.. ఎవరో గుర్తించగలరా..?

Nabha Natesh: దివినుంచి దిగివచ్చిన అప్సరసలా.. నభ అందాలు నభూతో నభవిష్యతి

Sunil : కమెడియన్ సునీల్‌‌‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీ సినిమాలో కీలక పాత్ర..! ఏ మూవీలో అంటే..