Dasara Box Office Collection : కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న దసరా.. ఆరు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Dasara Box Office Collection : కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న దసరా.. ఆరు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
Dasara

Updated on: Apr 05, 2023 | 5:43 PM

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను రీచ్ అయ్యింది దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మార్చి30న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికి కూడా ఈ సినిమా భారీ వసూళ్లతో థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇక ఈ సినిమా 6 డేస్ లో ఎంత వసూల్ చేసిందంటే..నైజాం 20.56 కోట్లు, సీడెడ్ 4.87 కోట్లు, ఉత్తరాంధ్ర 3.72కోట్లు, ఈస్ట్ 1.95 కోట్లు, వెస్ట్ 1.13 కోట్లు, గుంటూరు 2.28కోట్లు, కృష్ణా 1.61కోట్లు, నెల్లూరు 0.78 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 36.90కోట్లు,
కర్ణాటక 4.10 కోట్లు, తమిళనాడు 0.86కోట్లు,కేరళ 0.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.70 కోట్లు, ఓవర్సీస్ 9.35కోట్లు, వరల్డ్ వైడ్ గా 53.32 కోట్ల షేర్ ను రాబట్టింది దసరా

ఇక ఈ సినిమాలో నాని నటన, కీర్తి పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కథ తెలంగాణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దసరా సినిమా 5 వ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించగా 6 రోజుతో రూ.5.82 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ దిశగా దూసుకుపోతోంది.

Follow Us