Actor Nani: RJ నుంచి న్యాచురల్ స్టార్ వరకు.. నాని ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..

కేవలం హీరోయిజం సినిమాలు కాదు.. కంటెంట్ నచ్చితే ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. సహజ నటనతో పక్కింటి కుర్రాడిగా అనిపిస్తుంటారు. ఫ్యామిలీ అడియన్స్, యూత్‏లో నానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానుల కోసం తీసుకువచ్చాం. తొలినాళ్లలో బాపు, కే.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు నాని.

Actor Nani: RJ నుంచి న్యాచురల్ స్టార్ వరకు.. నాని ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..
Nani

Updated on: Feb 24, 2024 | 6:31 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో నాని ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‏గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి..ఇప్పుడు న్యాచురల్ స్టార్‏గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ అంతకు ముందు నాని రేడియో జాకీ. ఇప్పుడు హీరోగానే కాదు.. నిర్మాతగానూ రాణిస్తున్నారు. కేవలం హీరోయిజం సినిమాలు కాదు.. కంటెంట్ నచ్చితే ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. సహజ నటనతో పక్కింటి కుర్రాడిగా అనిపిస్తుంటారు. ఫ్యామిలీ అడియన్స్, యూత్‏లో నానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానుల కోసం తీసుకువచ్చాం. తొలినాళ్లలో బాపు, కే.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు నాని. అదే సమయంలో తన పనితీరుతో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిని ఆకర్షించారు.

ఆయన తెరకెక్కించిన ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక తన క్యూట్ లుక్స్‎తో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని హీరోగా తనదైన ముద్రవేశారు. ఈ మూవీలో కలర్స్ స్వాతి, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వచ్చిన అలా మొదలైంది సినిమా మరో సూపర్ హిట్ అయ్యింది. దీంతో నానికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.

ప్రస్తుతం నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నాయి. కానీ ఆయన మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అష్టా చెమ్మా సినిమాకు నానిని అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకున్నారు. సహాయ దర్శకుడి అంతగా రెమ్యునరేషన్ ఉండదు. కేవలం వర్క్ నేర్చుకోవడం.. భోజనం అందిస్తారు.. అలాగే అష్టా చెమ్మా సినిమాకు నానికి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా ఈ రోజు విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.