AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK 107 : శరవేగంగా బాలయ్య మూవీ షూటింగ్.. తెలంగాణ యాసలో గర్జించనున్న నట సింహం.?

న‌టసింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు 107 సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాలయ్య , క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఈ సినిమా రాబోతుంది.

NBK 107 : శరవేగంగా బాలయ్య మూవీ షూటింగ్.. తెలంగాణ యాసలో గర్జించనున్న నట సింహం.?
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2022 | 6:42 PM

Share

NBK 107 : న‌టసింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు 107 సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాలయ్య , క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఈ సినిమా రాబోతుంది. బాల‌య్య‌107వ సినిమాగా ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవలే సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొద‌లుపెట్టారు మేక‌ర్స్‌. బాలకృష్ణ – ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.

మాస్ హీరో మ‌రియు మాస్ ద‌ర్శ‌కుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వ‌నున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని టాక్ వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు. న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, నవీన్ నూలీ ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: అందమైన సింధూరం.. నిత్య యవ్వన మకరందం.. తెలుగులో 30 సినిమాలు చేసిన ఈ నటిని గుర్తించారా..?

Aha: తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..

Kiran Abbavaram : భీమ్లానాయక్ సినిమా దెబ్బకు ఈ కుర్ర హీరో సినిమాకూడా వాయిదా పడకతప్పలేదు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్