Krishnam Raju Death: కృష్ణం రాజును పితృసమానులుగా భావిస్తారు నందమూరి బాలయ్య. అందుకే వీలున్నప్పుడల్లా.. ఆయన్ను కలుస్తుంటారు. మాట్లాడుతుంటారు. అలాంటి కృష్ణం రాజు ఉన్నపళంగా మరణించారని తెలియగానే షాకయ్యారు బాలయ్య. షాకవ్వడేమే కాదు గోపీచంద్ మలినేని షూటింగ్‌ను మధ్యలోనే ఆపేసి.. రెబల్‌స్టార్ ఆత్మ శాంతించాలని తన షూటింగ్ టీంతో కలిసి కొద్దసేపు మౌనం పాటించారు బాలయ్య. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు కూడా..!
టీమ్ #NBK107 కృష్ణంరాజు గారి అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది,మరియు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.#RIPKrishnamRajuGaru pic.twitter.com/ocpNtePHVA
— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) September 11, 2022
కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నటనతో పాటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని..ఆయని మరణం ఎవరూ పూడ్చలేనిదని కొనియాడారు. ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు, సినీ రాజకీయ ప్రముఖులు రెబల్ స్టార్‌కు నివాళులర్పించారు. విభిన్న నటుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొయినాబాద్ దగ్గర..కనకమామిడిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..