Nandamuri Balakrishana: మొదట హార్ట్ బీట్ ఆగిపోయింది.. ఆ తర్వాత మిరాకిల్ జరిగింది

|

Jan 29, 2023 | 12:14 PM

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బాలయ్య స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

Nandamuri Balakrishana: మొదట హార్ట్ బీట్ ఆగిపోయింది.. ఆ తర్వాత మిరాకిల్ జరిగింది
Nandamuri Balakrishna
Follow us on

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాగాజా స్పందించారు బాలకృష్ణ. మాసీవ్ హార్ట్ అటాక్‌తోనే తారకరత్న కుప్పకూలినట్లు తెలిపారు. హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత మిరాకిల్ జరిగి హార్ట్ బీట్ స్టార్టయిందని తెలిపారు. బెటర్ ఐసీయూ కేర్ కోసం నారాయణకు హృదయాలకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మంచి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కుప్పం నుంచి ఏ పరిస్థితుల్లో తీసుకువచ్చారో.. అదే పరిస్థితుల్లో సిట్యువేషన్ ఉందని.. ప్రజంట్ అంతా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. పరిస్థితి దిగజారలేదని.. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అని.. అతని కోసం అందరూ ప్రార్థనులు చేయడం సంతోషంగా ఉందన్నారు బాలయ్య.

అందరి ఆశిస్సులు, ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామన్నారు బాలకృష్ణ. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా తారకరత్నకు స్టంట్ వేయడం కుదరలేదని.. అలా చేస్తే మళ్లీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే డాక్టర్లు స్టెప్ బై స్టెప్ మోనటరింగ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజంట్ తారకరత్న వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు. గిచ్చినప్పుడు ఒకసారి రెస్పాండ్ అవుతున్నారని.. మరోసారి రెస్పాండ్ అవ్వడంలేదని తెలిపారు. కాస్త కళ్ల మూమెంట్ ఉందని తెలిపారు. బ్రెయిన్ డ్యామేజ్ ఎంత అయిందని తర్వాత తెలుస్తుందన్నారు. తెలుగు, కన్నడ ప్రజలు చేస్తున్న ప్రార్థనలకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు శివరాజ్ కుమార్ రావడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..