అఖండ సినిమాతో నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన విజయాన్ని ఆదుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ కథతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లామాక్స్ కు వచ్చేసింది. ఇక ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య మరో టాలెంటెడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే గోపీచంద్ మలినేని తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు అనిల్. ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబీతో బాలయ్య సినిమా ఉంటుందని అంటున్నారు. బాబీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ 154వ సినిమాగా రానున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మెగాస్టార్ సినిమా తర్వాత బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడట బాబీ. ఇప్పటికే బాలకృష్ణకు ఓ లైన్ వినిపించాడని.. అది నచ్చడంతో బాలకృష్ణ ఓకే చెప్పారని టాక్. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాబీ జై లవకుశ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో మెప్పించారు. ఇక ఇప్పుడు బాలయ్యతో బాబీ సినిమా అంటూ వార్తలు రావడంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.