Mahesh Babu: మా అన్న వదిన సూపర్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..

మహేష్ కేవలం టాలీవుడ్ సినిమాలతోనే ఆ స్టార్ డమ్ ను ఎప్పుడో సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు పండగే..

Mahesh Babu: మా అన్న వదిన సూపర్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..
Mahesh Babu, Namrata

Updated on: Dec 18, 2022 | 3:59 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న .క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ మహేష్ కేవలం టాలీవుడ్ సినిమాలతోనే ఆ స్టార్ డమ్ ను ఎప్పుడో సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు పండగే.. ఆ సినిమాలకే కాదు మంచి మనసుకు పెద్ద ఎత్తున్న ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ వేల చిన్నారుల గుండె చప్పుడు. అలాగే ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు మహేష్. ఇక మహేష్ ఆయన సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో లవబుల్ కపుల్ గా ఈ జంటకు పేరుంది. మహేష్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంటే నమ్రత ఇంటిని పిల్లలను చూసుకుంటున్నారు. అలాగే మహేష్ కు సంబంధించిన బిజినెస్ లు కూడా చూసుకుంటున్నారు నమ్రత. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మహేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం చాలా మారిపోయిందని అన్నారు నమ్రత. పెళ్ళికి ముందు మహేష్ తో ఓ డీల్ సెట్ చేసుకున్నా.. పెళ్లి తర్వాత నటించవద్దు అని మహేష్ చెప్పాడు. అలాగే నేను కూడా పెద్ద బిల్డింగ్ లో ఉండను ఓ అపార్ట్ మెంట్ తీసుకొని ఉందాం అని డీల్ మాట్లాడుకున్నాం అని తెలిపారు. ఎందుకంటే పెద్ద బిల్డింగ్ లో ఉండటం అంటే తనకు భయం అని అన్నారు. అలాగే వీరు పెళ్లి తర్వాత ఓ అపార్ట్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు ఓ కొత్త ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇక మహేష్ తనకు అన్ని సందర్భాల్లో తోడుగా ఉన్నాడని. ఎప్పుడు తనను వెంటుంది నడిపించాడని అన్నారు. ముఖ్యంగా తన తల్లిదండ్రులను కోల్పోయిన సమయంలో మహేష్ తనకు అన్ని అయ్యాడని.. ఏ సమస్య వచ్చిన ఎదురు నిలబడ్డాడని తెలిపారు నమ్రత.. అలాగే మహేష్ ఇటీవల వరుస అన్న, అమ్మ, నాన్న ను కోల్పోయి కొండంత బాధలో మునిగిపోయారు. ఆయన ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఆ సమయంలో నమ్రత మహేష్ కు తోడుగా ఉంటూ ఆయనకు దైర్యం చెప్పారు.  ఇలాంటి క్లిష్ట సమయంలో నమ్రత అతడికి అన్నివిధాలా అండగా ఉన్నారు. ఇక వీరి అన్యూన్యతను చూసి మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. నమ్రత మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయలు చెప్పడంతో.. మహేష్ అన్న నమ్రత వదిన మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.