
అక్కినేని నాగార్జున- రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ శివ. నాగ్, ఆర్జీవీ సినిమా కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీని సుమారు మూడున్నర దశాబ్ధాల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేశారు. శివ పాత ప్రింట్ ను డాల్బీ అట్మాస్ 4కే హై రెజల్యూషన్ లో కొత్త సౌండ్ తో మిక్స్ చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. అలాగే కొన్ని సీన్ల కోసం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. ఈ నెల 14న విడుదలైన శివ 4K వెర్షన్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నవంబర్ లాంటి అన్ సీజన్ లోనూ, అందులోనూ రి రిలీజ్ లోనూ నాగ్ సినిమాకు మంచి కలెక్షన్లు రావడం విశేషం. ఇదిలా ఉంటే శివ 4K వెర్షన్‌ను థియేటర్లలో చూడని వారి కోసం ఆసక్తికర అప్‌డేట్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. హీరో నాగార్జునే స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
IFFI 2025 ఈవెంట్‌లో పాల్గొన్న శివ రీ రిలీజ్ పై మాట్లాడాడు. త్వరలోనే శివ 4కే వెర్షన్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నాడు. అయితే ఏ ఓటీటీలో ఎప్పుడు వస్తుందన్న విషయాలపై క్లారిటీ రాలేదు. రానున్న రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుందన్నమాట. మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న శివ 4K వెర్షన్ కు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
శివ సినిమాలో అక్కినేని అమల హీరోయిన్‌గా నటించగా.. రఘువరన్ విలన్‌గా నటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.