Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మథుడి ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసా ?.. నాగార్జున చెప్పిన సీక్రెట్స్ ఇవే..
విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికీ నాగార్జున క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అరవై ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు నాగ్. ముఖంపై ఎలాంటి మడతలు.. వయసు తాలుకూ ఛాయలు కనిపించకుండా ఇప్పటికీ కుర్రాడిలానే కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే నాగార్జున ఫిట్ నెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించి చిత్రం నా సామిరంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలకపాత్రలు పోషించగా.. కీరవాణి సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికీ నాగార్జున క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అరవై ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు నాగ్. ముఖంపై ఎలాంటి మడతలు.. వయసు తాలుకూ ఛాయలు కనిపించకుండా ఇప్పటికీ కుర్రాడిలానే కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే నాగార్జున ఫిట్ నెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతో ఆసక్తి చూపుతుంటారు. కానీ ఎప్పుడూ నాగ్ తన ఫిట్ నెస్ గురించి మాట్లాడలేదు. కానీ తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్స్ బయటపెట్టాడు.
ఇటీవల నా సామిరంగ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న తన ఫిట్ నెస్ రహస్యం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మీరు డైట్ మెయింటెన్ చేస్తారా ?.. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటీ ? అని కీరవాణి అడగ్గా.. నాగ్ స్పందిస్తూ.. “నేను ఎలాంటి డైట్ మెయింటైన్ చేయను. ఏం తినాలనిపిస్తుందో అన్ని కడుపునిండా తింటాను.. డిన్నర్ మాత్రం ఏడు గంటలకు చేస్తాను. బ్రేక్ ఫాస్ట్ లో వైట్ ఎగ్స్ తోపాటు బ్రెడ్ కూడా తీసుకుంటాను. డిన్నర్ చికెన్ తోపాటు నచ్చవన్నీ తింటాను.. ఎంత తిన్నా జిమ్ చేసి కరిగించుకోవడం వల్లే ఫిట్ గా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు నాగ్.
అలాగే రోజు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా స్వీట్ తినే పడుకుంటానని.. స్వీట్ తినకపోతే తనకు నిద్ర కూడా పట్టదని అన్నారు. ఎలాంటి డైట్ మెయింటైన్ చేయకుండా కడుపునిండా తిని ఉదయం లేవగానే వర్కౌట్స్ చేస్తే మనం తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్ రూపంలో కరిగిపోయి ఫిట్ గా ఉంటామని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.