AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?

ఏపీ ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ వచ్చింది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్‌ బలపర్చగా.. నామినేషన్‌ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఇంతకీ.. మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయి?...

AP News: ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిపై క్లారిటీ.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేదెవరు?
Nagababu Files Nomination
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2025 | 9:53 PM

Share

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌తోపాటు.. పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక.. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలు ఉండగా.. ఒక అభ్యర్థిగా నాగబాబు పేరును కూటమి ఖరారు చేయడంతో పవన్ ఆదేశాల మేరకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

వాస్తవానికి.. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అంతకుముందు.. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటారనే టాక్‌ కూడా గట్టిగానే నడిచింది. అయితే.. ఆయా ప్రచారాలు ఎలా ఉన్నా.. సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్‌ డిక్లేర్‌ చేయడంతో నామినేషన్‌ వేశారు. ఇదిలావుంటే.. ఐదు స్థానాలు కూటమికే దక్కనుండడంతో ఆయా సీట్ల కోసం చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దాంతో.. అప్పట్లో హామీ పొందిన నేతలు.. ఇప్పుడు సీఎం చంద్రబాబును.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరికి చాన్స్‌ దక్కుతుంది?.. అనేది ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.    

Follow Us
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్‌ లేచి వెళ్లిపోయాడు !
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్‌ లేచి వెళ్లిపోయాడు !
శివలింగానికి పసుపు ఎందుకు సమర్పించరు? ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక..
శివలింగానికి పసుపు ఎందుకు సమర్పించరు? ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక..
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
నాటు కోడిని కోసేటప్పుడు చాలామంది పసుపు రాస్తారు? ఇది ఆచారమా?
నాటు కోడిని కోసేటప్పుడు చాలామంది పసుపు రాస్తారు? ఇది ఆచారమా?
5 నిమిషాల్లోనే కరకరలాడే పకోడి.. ఈ రెండు మిక్స్ చేశారంటే అద్భుతం..
5 నిమిషాల్లోనే కరకరలాడే పకోడి.. ఈ రెండు మిక్స్ చేశారంటే అద్భుతం..
ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. ఎలా ఉండేదంటే..
ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. ఎలా ఉండేదంటే..
గ్రౌండ్లో చిట్టీల సెలబ్రేషన్ పై రషీద్ ఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్
గ్రౌండ్లో చిట్టీల సెలబ్రేషన్ పై రషీద్ ఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా?ఈ రాట్ ట్రాప్ టెక్నిక్ తెలుసుకోండి
కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా?ఈ రాట్ ట్రాప్ టెక్నిక్ తెలుసుకోండి