AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Tips: ఉన్నదాంతో తృప్తి పడుతున్నారా.. ఈ విషయంలో మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు

తృప్తిలేని జీవితం వ్యర్థమంటారు. కానీ, ఇంగ్లిష్ లో మరో సామెత ఉంది.. డోంట్ సెటిల్ ఫర్ లెస్ అని. ఏది ఎక్కడ ఉపయోగించాలో తెలియకుంటే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది మీరే. అవును మీరు జీవితంలో ఎదగకుండా ఆపుతున్న వాటిలో మీ రోజూవారి అలవాట్లే ముఖ్యం. అందులోనూ ఉన్నదాంతో గడిపేద్దాంలే అనే ధోరణి మీలో ఉంటే మీరిక ఎప్పటికీ ఎదగలేరని అంటున్నారు నిపుణులు. మరి ఈ విషయంలో మీరే టైపో చెక్ చేసుకోండి..

Success Tips: ఉన్నదాంతో తృప్తి పడుతున్నారా.. ఈ విషయంలో మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు
Success Tips
Bhavani
|

Updated on: Mar 07, 2025 | 9:41 PM

Share

నిజానికి సక్సెస్‌ను డిఫైన్ చేయడానికి ఓ కొలమానమంటూ ఏదీ లేదు. కానీ మన రోజూవారి అలవాట్లు మాత్రం మనం జీవితంలో ఏ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని కచ్చితంగా నిర్ణయిస్తాయి. ఇదే విషయాన్ని తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా తమ అధ్యయనంలో కనుగొంది. జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తులను ఈ 5 అలవాట్లు కచ్చితంగా ప్రభావితం చేస్తున్నాయని వారు తెలిపారు. మరి జీవితంలో పై స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో ఉన్న ఆ ఆరోగ్యకరమైన అలవాట్లేంటో మీరూ చూసేయండి..

విశ్రాంతి తీసుకుంటే సక్సెస్ వస్తుందా..

చాలా మంది జీవితంలో గొడ్డులా కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ వరిస్తుందని అనుకుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదట. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ కే ఎక్కువ విలువనిస్తుందీ సమాజం. మీరు మీకోసం కొంత విశ్రాంతి తీసుకోవాలట. ఇదే మీ ప్రొడక్టివిటీని బ్యాలెన్స్ చేస్తుంది. రోజులో కాసేపు విశ్రాంతికి కేటాయించండి. ఆ సమయంలో మనాసికంగా, శారీరకంగా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచే పనులు చేయండి. తర్వాతి రోజు రెట్టింపు ఉత్సాహంతో నిద్రలేస్తారు.

బి పాజిటివ్..

ఎల్లప్పుడూ ఒక వ్యక్తి పాజిటివ్ గానే ఆలోచించాలి అంటే అదంత ఆచరణ యోగ్యం కాకపోవచ్చు. కానీ మీ లక్ష్యాలపై మాత్రమే మీరు ఫోకస్ పెడితే ఇది సాధ్యమే. ఎవరి విషయంలోనూ ఎక్కువగా కలుగజేసుకోకుండా మీ పనేంటో మీరు చూసుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పాజిటివిటీ మీ జీవితంలోకి సక్సెస్ ను త్వరగా ఆహ్వానిస్తుంది. నలుగురిలో మీకు ప్రాధాన్యం లభిస్తుంది. మీరు అందరికన్నా ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించేలా ఈ క్వాలిటీ మీకు హెల్ప్ చేస్తుంది.

ఎప్పుడు నిద్ర లేవాలి..

ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయని మీకు బాగా తెలుసు. మరి మీరు దీన్ని ఏ మేరకు పాటిస్తున్నారు. చాలా కష్టంగా అనిపించినా ఉదయాన్నే నిద్రలేచేవారికి మిగిలిన వారికి ఎంతో తేడా ఉంటుంది. వారి అన్ని విషయాల్లో ముందుండేందకు ఈ అలవాటు తోడ్పడుతుంది. అందరికన్నా ఓ పని ఎక్కువ చేసుకోవడానికి మీకు అదనపు సమయం లభిస్తుంది. నిద్రపోవడం నిద్రలేవడం వంటి విషయాలపై మీకు కచ్చితంగా కంట్రోల్ ఉండాలి. పొద్దున్నే నిద్ర లేవకుండా జీవితంలో గొప్పవారైన వారు మీకెవరైనా తెలుసా మరి..?

అసలేం తింటున్నారు..

సక్సెస్ అవ్వడానికి తిండికి ఏంటి సంబంధం అంటారా.. చాలానే ఉంది. మీ ఆహారపు అలవాట్లే మిమ్మల్ని కాపాడతాయి. బయట తిండ్లు మీ రోగనిరోధక శక్తిని తగ్గించేస్తాయి. తరచూ జబ్బు పడేవారు ఏ మేరకు సక్సెస్ పై ఫోకస్ నిలపగలరు. శరీరం ఆరోగ్యంగా ఉన్నవారి మనసు, బుద్ధి కూడా రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. ఇది మిమ్మల్ని ఓ అడుగు ముందుంచడంలో సాయపడుతుంది. మరి మీ డైట్ రొటీన్ ను ఎప్పటినుంచి మారుస్తున్నారు.. ?

ఉన్నదాంతో సరిపెట్టుకుంటున్నారా..

తృప్తి లేని జీవితం వ్యర్థం అంటారు. ఇది అక్షరాలా నిజం. కానీ మీరు ఏ విషయంలో ఇలా అనుకుంటున్నారు. అత్యాశకు పోకుండా మనకు ఉన్నదాన్ని గుర్తించి సంతోషపడటం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది. కానీ అన్ని విషయాల్లో ఈ ఫార్ములా పనికి రాదు. మీరెప్పుడూ మీ స్టాండర్డ్ ను తగ్గించుకుని బతికితే ఎప్పటికి ఉన్నచోటే ఉండిపోతారు. చాలెంజెస్ ను స్వీకరించండి. మీ సామర్థ్యాలకు పదునుపెట్టే కఠినమైన పనులను ఎంచుకోండి. అప్పుడు మీ హోదా కూడా పెరుగుతుంది. ఇంతకాలం మీరెంత చిన్న పనుల కోసం కష్టపడ్డారో మీకే అర్థమవుతుంది.