అతడు అప్పుటివరకు ఎవరికి పరిచయంలేని వ్యక్తి..
అంతకుముందు ఎప్పుడూ సినిమాలకు సహాయం దర్శకుడిగా కూడా చెయ్యలేదు..ఏదో సీడీల షాపు నడుపుకునేవాడు
మానుప్యులేట్ చేసి అక్కినేని వారసుడు నాగర్జునని తన ఫస్ట్ సినిమా చేయడానికి ఒప్పించాడు..
మూవీకి అందరూ సీనియర్ టెక్నిషియన్లే పనిచేశారు..కానీ వారిలో ఆర్జీవిపై నమ్మకం ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు..
సినిమా రీలీజయ్యింది..ఇండస్ట్రీ షేక్ అయ్యింది..
ఒక్కసారి హీరోతో సైకిల్ చైన్ లాగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అలియాస్ రామూ.
మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు ఆర్జీవీ. నాగార్జునలో మరో కోణాన్ని ఆవిష్కరించి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా శివ. నేటికి ఈ సినిమా రిలీజై 30 ఏళ్లు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీపై ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటివరకు ఉన్నమూస ఫైట్లు, డ్యాన్స్‌లు, రెగ్యులర్ మేకింగ్ స్టైల్ ‘శివ’ తీసుకువచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అంతెందుకు పోస్టర్ డిజైనింగ్‌లో కూడా ‘శివ’ మూవీ తన కొత్త పంథాను చాటుకుంది.
30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే ఆ మూవీ గొప్పదనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.తెలుగు సినిమా రంగంలో అప్పటికీ ఎప్పటికీ రోల్ మోడల్ గా నిలిచింది శివ. ఈ మూవీ అప్పట్లో న్యూ జనరేషన్ రచయితలకు, డైరక్టర్లకు ఒక టెక్ట్ బుక్‌లా మారింది. ఈ సినిమాతోనే బెజవాడ రౌడీయిజాన్ని తొలి సారి వెండితెరపై ఆవిష్కరించాడు దర్శకుడు ఆర్జీవీ. కాగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం, నాగార్జున జీవిత భాగస్వామిగా అమల మారేట్టుగా చేసింది కూడా.
ఇక ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా వర్మ ట్విట్టర్ వేదికగా, “నాగ్. నేడు మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు” అని రాసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Hey @iamnagarjuna , today is the 30th birthday of our love child ??? pic.twitter.com/i7RLgjiX95
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2019