Virata Parvam: విరాటపర్వం నుంచి నగదారిలో సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. 

తాజాగా విరాట పర్వం సినిమా నుంచి నాగదారిలో సాంగ్ ప్రోమ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Virata Parvam: విరాటపర్వం నుంచి నగదారిలో సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. 
Virata Parvam

Updated on: Jun 01, 2022 | 8:08 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati), న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తోన్న చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో విరాట పర్వం నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విరాట పర్వం సినిమా నుంచి నగదారిలో సాంగ్ ప్రోమ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

“నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగదారిలో.. చివరకు నెగ్గిదేది.. తగ్గేదేది నగదారిలో ” .. సాగే ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. నగదారిలో ఫుల్ లిరికల్ సాంగ్ ను రేపు (జూన్ 2న) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. సాయి పల్లవి, రానా దగ్గుబాటి లుక్స్.. ఆకట్టుకుంటున్నాయి. ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ సాహిత్యం అందించిన ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా. వరం అద్భుతంగా ఆలపించారు. . నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా.. రవి శంకర్ అలియాన్ రవన్న పాత్రలో నటించగా. సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి