అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. విడుదలైన మొదటిరోజునే సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదు చేసుకుంది. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని బంగార్రాజు చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్య్రకమంలో నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ జునైద్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అక్కినేని నాగ చైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాగచైతన్య మాట్లాడుతూ, బంగార్రాజులో చేస్తున్నప్పుడే `సోగ్గాడే చిన్నినాయన` పై భారీ అంచనాలున్నాయి. అది తెలిసి ఈ సినిమాలో చేయడం నాకు సవాల్ గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎన్జర్జిక్ పాత్ర ఇంతవరకు చేయలేదు. ఈ పాత్ర చేయడానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమాతో ఆయన నన్ను ప్రేక్షకులకు దగ్గర చేశాడు. బంగార్రాజుతో మరింత దగ్గరకు వెళ్ళేలా చేశాడు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. ఆయనకు అందరి పల్స్ బాగా తెలుసు. ఇక షూటింగ్‌లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఓసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. కాస్త జలసీ అనిపించినా ఆరోగ్యకరమైన వాతావరణంలో నన్న నడిపించింది అని తెలిపారు.
Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..
Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..
Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున