Naga Shaurya : ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను… కానీ ఒక్కసారి కూడా చూడలేదు: నాగశౌర్య

|

Dec 07, 2021 | 9:09 PM

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.

Naga Shaurya : ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను... కానీ ఒక్కసారి కూడా చూడలేదు: నాగశౌర్య
Naga Shourya
Follow us on

Naga Shaurya : స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథను 2019లో విన్నాను అన్నారు. సునీల్ నారంగ్ గారు నాకు అన్నలాంటి వారు. ఫోన్ చేసి కథ విను అన్నారు. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు. నా నిర్మాతలు ఈ సినిమాకు పెద్ద బలం. మా మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ అద్బుతమైన సంగీతం అందించారు.

అఖండ సినిమాలో రెండు పాటలున్నాయి. మా సినిమాలో కూడా రెండు పాటలున్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు పాటలు అవసరం లేదు అని మరోసారి నిరూపించారు. కెమెరామెన్ రామ్ గారు నన్ను అద్భుతంగా చూపించారు. మా హీరోయిన్ కేతిక శర్మ ఈ సినిమాకు, మేం అనుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారు. రొమాంటిక్ సినిమాలో ఆమెను చూసి ఫిదా అయ్యాను. అది 2009 అనుకుంటాను… అప్పుడు హ్యాపీ డేస్ సినిమాను వదిలారు. శేఖర్ కమ్ముల గారి కోసం..పద్మారావు నగర్‌‌లో ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను. కానీ ఒక్కసారి కూడా చూడలేదు. మెట్ల మీద పెన్ను, ప్యాడ్ పట్టుకుని రాసుకుంటూ ఉండేవారు. ఆ డెడికేషన్ అవసరం అన్నారు. పుల్లెల గోపీచంద్ గారు ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు ఎంతో కష్టపడి అక్కడ గెలిస్తే.. మేం ఇక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం. ఇండస్ట్రీలో నాకు శర్వా బెస్ట్ ఫ్రెండ్. శర్వా భయ్యాని ఓసారి కలిశాను. అప్పుడు సినిమా కాస్త ఆడలేదు. ఏమైనా డల్‌గా ఉంటాడేమో అనుకున్నాను. కానీ అలా లేడు. మనలో ఓ కన్‌సిస్టెంట్, నిజాయితీ ఉండాలని అన్నాడు. శర్వాలా అందరికీ ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. మా అందరికీ శర్వానంద్ ఇన్‌స్పిరేషన్. సక్సెస్ ఒక్కసారి వస్తుంది.. అది వచ్చే వరకు మనం ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు శర్వాకు థ్యాంక్స్’ అని నాగ శౌర్య అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Narendra Modi: సిరివెన్నెల సతీమణికి ప్రధాని మోడీ లేఖ.. ఆయనను స్మరించుకుంటూ…

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..