Akkineni Naga Chaitanya: జోరు పెంచిన అక్కినేని కుర్ర హీరో.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘థాంక్యూ’ మూవీ..

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య మజిలీ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Akkineni Naga Chaitanya: జోరు పెంచిన అక్కినేని కుర్ర హీరో.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న థాంక్యూ మూవీ..
Naga Chaitanya

Edited By:

Updated on: Apr 26, 2021 | 8:46 AM

Akkineni Naga Chaitanya: అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య మజిలీ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య.  చైతన్య- సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య. ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఇక ‘థాంక్యూ’ సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్నాడు విక్రమ్.ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం సిద్ధం అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. థాంక్యూ టీమ్ సెకండ్ షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేసినట్లు టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

Thaman: ఆ వీడియో చూసి చ‌లించి పోయిన థ‌మ‌న్‌.. త‌న‌లో ఓ కొత్త క‌ల మొద‌లైంది.. ఇంత‌కీ ఏంటా వీడియో…

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం