Love Story : మనసును తాకే అందమైన ప్రేమ కథ .. ఆకట్టుకుంటున్నశేఖర్ కమ్ముల’లవ్ స్టోరీ’ ట్రైలర్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Love Story : మనసును తాకే అందమైన ప్రేమ కథ .. ఆకట్టుకుంటున్నశేఖర్ కమ్ములలవ్ స్టోరీ ట్రైలర్..
Love Story

Updated on: Sep 13, 2021 | 11:14 AM

Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చైతన్య , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగదరియా పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అన్ని సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది.. కానీ అది కుదర్లేదు దాంతో మే కు షిఫ్ట్ అయ్యారు మేకర్స్. కానీ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గక పోవడంతో మే లోకూడా రిలీజ్ అవలేదు. అయితే ఈ సినిమాను అక్టోబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ విషయం పై నిర్మాతలకు- థియేటర్స్ యజమానులకు మధ్య చర్చ కూడా జరిగింది. దాంతో లవ్ స్టోరీ సినిమా వెనక్కు తగ్గింది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. సినిమా అందమైన ప్రేమ కథతోపాటు హృదయాన్ని తాకే ఎమోషన్ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.  లవ్ స్టోరీ ఈ నెల 24న విడుదలకానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..

Uttej: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత..

Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోటా సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..