Uttej Wife Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత..

గత కొంత కాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు అనారోగ్య కారణాలతో మరణించిన

Uttej Wife Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత..
Uttej
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2021 | 12:36 PM

గత కొంత కాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు అనారోగ్య కారణాలతో మరణించిన సంఘటనలు ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. హైదరాబాద్‏లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 8.30 నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పడుతున్న ఆమెకు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్ భార్య మరణంపై మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్.. ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్‏ను పరామర్శించారు. పద్మావతి మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఉత్తేజ్ తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‎గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసి.. ఆ తర్వాత నటుడిగా మారారు. మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, డేంజర్ వంటి సినిమాలకు మాటలు కూడా రాశారు ఉత్తేజ్.. దాదాపు 200 చిత్రాల్లో నటించి నటుడిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఉత్తేజ్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. అందులో ఆయన భార్య పద్మవతి కూడా పాలు పంచుకునేది. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఇక ఉత్తేజ్ భార్య పద్మవతి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.

Also Read: Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోటా సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..

Nabha Natesh: సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..

Pushpa : కాకినాడలో పుష్పరాజ్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్.. మూవీ రిలీజ్ డేట్ అదేనా..?

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?