Nabha Natesh: సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు.

Nabha Natesh: సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2021 | 9:39 AM

Nabha Natesh: నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటించింది. ఈ సినిమాలో తన నటనతో వయ్యారంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ హాటీ. తెలంగాణ యాసలో నభానటేష్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. యువతలో నభా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో అమ్మాయిగారికు ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. తాజా ఈ బ్యూటీ నితిన్‌కు జోడీగా మ్యాస్ట్రో మూవీలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్.. హిందీ మూవీ అంధాధున్‌‌కు రీమేక్. తమన్నా భాటియా నెగెటివ్ పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటం తో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచుంది చిత్రయూనిట్ ఇప్పటికే సినిమా నుంచి పాటలను ఒకొక్కటిగా విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెబ్ సీరీస్‌లో కూడా నటించడానికి సై అంటోంది. ”మంచి కథలు వస్తే వెబ్ సీరీస్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తాను. ఎక్కడైనా సరే వైవిధ్యమైన పాత్రలు మాత్రమే చేయాలని వుంది” అంటూ చెప్పుకొచ్చింది నభా నటేష్. మరి త్వరలో నభా నటేష్ వెబ్ సిరీస్‌లో కూడా మెరుస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..