సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ‘హనుమాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్ , వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు సంచలనం సృష్టింస్తోంది. వరల్డ్ వైడ్ గా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు, నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సమంత, రవితేజ, గోపిచంద్ వంటి స్టార్స్ హనుమాన్ సినిమా అద్భుతంగా ఉందంటూ రివ్యూ ఇచ్చారు. ఇక ఇప్పుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హనుమాన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
“హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అభినందనలు. హనుమాన్ రైటింగ్ లో కొత్త తరం ఆలోచనలు, సరికొత్త కాన్సెప్ట్ కనిపించాయి. మూవీ మొత్తం గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఇక తేజా సజ్జా అద్భుతమైన నటనతో కన్విన్స్ చేసే విధంగా నటించాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యార్, వినయ్ రాయ్ లతోపాటు. చిత్రబృందానికి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు చైతూ. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Congrats @PrasanthVarma for the blockbuster #Hanuman such new age writing and conceptualizing , goosebump moments throughout .. you have me invested in your universe !
Amazing performance @tejasajja123 played the character with superb conviction .. also @varusarath5…— chaitanya akkineni (@chay_akkineni) January 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.