Naga Chaitanya: రెండేళ్లుగా కఠిన శిక్షణ.. కొత్త ప్రాజెక్ట్ కోసం నాగ చైతన్య వర్క్ అవుట్స్.. వీడియో చూశారా ?..

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రానికి డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‎గా నటిస్తోన్న విషయాన్ని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందిస్తుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం NC23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ కాబోతుంది.

Naga Chaitanya: రెండేళ్లుగా కఠిన శిక్షణ.. కొత్త ప్రాజెక్ట్ కోసం నాగ చైతన్య వర్క్ అవుట్స్.. వీడియో చూశారా ?..
Naga Chaintanya

Updated on: Nov 05, 2023 | 5:26 PM

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ పై మరింత ఫోకస్ పెట్టారు. చాలా రోజులుగా ఈ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రానికి డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‎గా నటిస్తోన్న విషయాన్ని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందిస్తుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం NC23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం చైతూ దాదాపు రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నారు. కఠినమైన వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియోలో చైతూ పుష్ప్స్, బ్యాక్ టూ బ్యాక్ సెట్స్, హార్డ్ హిట్టింగ్ కదలికలను అమలు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం చైతూ జిమ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

2018లో గుజరాత్ విరావల్ నుంచి 21 మంది మత్య్సకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకున్నారు. వారిలో ఎచ్చెర్ల మండలం కె మత్య్సలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు అనే వ్యక్తి ఉన్నాడు. అతడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చైతూ మత్య్సకారులతో కలిసి సముద్రానికి చేపల వేటకు వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. చైతూ చివరిసారిగా కస్టడీ చిత్రంలో కనిపించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేయగా.. మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో చైతూ సరసన కృతి శెట్టి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు చైతూ నటించిన ధూత వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.