Naga Chaitanya: లండన్‌ రెస్టారెంట్‌లో నాగ చైతన్య.. వెనకున్న బ్యూటీ ఆమేనా..?

|

Mar 29, 2023 | 9:07 AM

సామ్ ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకుంది. చైతు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. అయితే నాగ చైతన్య మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya: లండన్‌ రెస్టారెంట్‌లో నాగ చైతన్య.. వెనకున్న బ్యూటీ ఆమేనా..?
Naga Chaitanya
Follow us on

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సమంత విడిపోయిన దగ్గర నుంచి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. సామ్ ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకుంది. చైతు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. అయితే నాగ చైతన్య మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళతో రిలేషన్ లో ఉన్నాడని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరు కెమెరాల కంటికి చిక్కారు. నాగచైతన్య బిజీ షెడ్యూల్‌ మెయింటైన్‌ చేస్తూనే.. వీలు దొరికినప్పుడల్లా ఈ భామతో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ఈ ఇద్దరు కలిసి కనిపించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లండన్‌ రెస్టారెంట్‌ ఫొటో ఒకటి ఈ ఇద్దరి డేటింగ్ రూమర్స్ కు బలం చేకూరుస్తుంది. చైతూ, శోభితా ధూళిపాళ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో.. చైతూతో చెఫ్‌ ఫొటో దిగాడు.

ఆ వెనకాల శోభితా ధూళిపాళ కూడా ఉన్నారు. ఆమె తన మొఖం కనిపించకుండా.. చేయి అడ్డుపెట్టుకొని ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మరి చైతూ, శోభితా డేటింగ్ వార్తలపై స్పందిస్తారేమో చూడాలి.

Sobhita Dhulipala , Naga Ch