టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ పెళ్లి వేడుక జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని టాక్. గ్రాండ్ వెడ్డింగ్ కోసం వేదికను సిద్ధం చేసే బాధ్యతలను ఓ ప్రముఖ ఆర్డ్ డైరెక్టర్ కు అప్పగించినట్లు సమాచారం. నాగ చైతన్య- శోభితల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ, రాజకీయల ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సంగతి పక్కన పెడితే నాగ చైతన్య- శోభితల పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. అదేంటంటే.. తమకు కాబోయే అల్లుడికి శోభిత తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలు ఇవ్వనున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యకు రేసింగ్ కార్లంటే చాలామని తెలుసుకుని, ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా అతనికి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను ఇవ్వనున్నారట.
అయితే మరోవైపు అక్కినేని కుటుంబం తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని శోభితతో పాటు వారి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అందుకే శోభిత కూడా ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకురాకుండా కేవలం బంగారం మాత్రమే కట్నంగా తీసుకొస్తోందని నెట్టింట వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే పెళ్లయ్యే వరకు ఆగాల్సిందే.
కాగా ఎంగేజ్ మెంట్ తర్వాత ఎవరి సినిమా పనుల్లో వారు బిజీ అయిపోయారు చైతన్య, శోభిత. అయితే ఇటీవల జరిగిన ఏఏన్నార్ శతజయంతి వేడుకల్లో శోభిత కూడా తళుక్కుమంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.