Kalki 2898 AD: నాగీ.. నీలో ఏదో మ్యాజిక్ ఉందోయ్.. నీ ఆలోచనల్లో తెలుగు సినిమా భద్రం
ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్, ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, నెంబర్ వన్ హీరోయిన్ దీపిక ఇలాంటి కాస్టింగ్‌ను డీల్ చేయాలంటే ఆ డైరెక్టర్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.? కానీ జస్ట్ రెండు సినిమాల అనుభవంతోనే ఈ డ్రీమ్ కాంబోను సెట్ చేశారు నాగీ. తన కథ మీద నమ్మకంతో టాప్ స్టార్స్‌ను అప్రొచ్ అయి ఒప్పించారు.
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు నాగీ. తొలి సినిమానే కమర్షియల్ ట్రెండ్‌కు దూరంగా డిఫరెంట్ జానర్‌ను ఎంచుకొని సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఫీలయ్యారు. అలె భలే సినిమా తీశాడని అందరూ మెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా మహానటి సావిత్రి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే సాహసం చేశారు ఈ యువ డైరెక్టర్. ఈ సినిమాను ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్ అయిన నాగీ, రెండో ప్రయత్నంలోనే భేష్ అనిపించుకున్నారు. ఇతనిలో ఏదో మ్యాజిక్ ఉంది అనే ముద్ర వేసుకున్నాడు. అందుకే కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన అనుభవమే ఉన్న నాగీకి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు.
కల్కి 2898 ఏడీ అనే సినిమా కోసం దాదాపు ఐదేళ్లుగా కష్టపడుతున్నారు నాగీ. లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్‌ను భుజానికి ఎత్తుకున్న ఈ యంగ్ డైరెక్టర్, తన ఊహల్లో ఉన్న విజువల్స్‌ను తెర మీదకు తీసుకు వచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. తొలిసారిగా సినిమా మేకింగ్‌లో ఆటోమొబైల్ ఇంజనీర్స్‌ను భాగం చేయటం, మహీంద్ర లాంటి ఆటోమొబైల్ కంపెనీస్‌లో కలిసి వర్క్ చేయటం లాంటి ప్రయోగాలు చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయటంలో సక్సెస్‌లో అయ్యారు నాగీ. ముఖ్యంగా స్క్రాచ్ పేరుతో మేకింగ్ వీడియోస్‌ను రిలీజ్ చేస్తూ తెర వెనుక టీమ్ పడిన కష్టాన్ని ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. ఇలా ప్రతీ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకుపోతున్న నాగీ, కల్కి రిలీజ్ తరువాత ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అతని కథలో ఎంత బలం లేకపోతే అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి వాళ్లు ఈ చిత్రంలో భాగమవుతారు చెప్పండి. ఏది ఏమైనా కేవీ.. నాగీ తెలుగు ప్రజలు గర్వపడేలా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతాడు అనిపిస్తుంది.
కల్కి విషయంలో ఏ సెంటిమెంట్‌నీ మిస్ కావడం లేదు నాగ్ అశ్విన్. మహానటితో తనకు బాగా కలిసొచ్చిన కీర్తీ సురేష్ చేత బుజ్జికి వాయిస్ ఇప్పించేశారు. పూర్తి స్థాయి టెక్నికల్ సినిమాలో ఫుల్ రిలీఫ్ బుజ్జి కేరక్టర్ అని ఇట్టే అర్థమైపోతోంది. సినిమాలో ఇలాంటి స్వీట్ సర్‌ప్రైజ్‌లు ఇంకా ఏమేం ఉంటాయోననే ఆసక్తి కూడా క్రియేట్ అయింది జనాల్లో.
స్పెషల్ ట్రైలర్, పాటలు, కేరక్టర్ల ఇంట్రడక్షన్లు, ఇంటర్వ్యూలు, ఆడియన్స్ మీట్స్, ఆల్ ఇండియా టూర్… అంటూ ఈ నెల రోజుల్లో ఏమాత్రం ఖాళీ లేకుండా కల్కి ప్రమోషన్లు ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తెలుగులో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల సినిమా రాలేదన్న కొరతను కల్కి 2898ఏడీతో తీర్చేయాలన్న పట్టుదల కనిపిస్తోంది నాగ్ అశ్విన్‌లో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.