Viral Video: నాటు నాటు పాటకు క్రేజ్ మాములుగా లేదుగా.. పెళ్లి రిసెప్షన్‌లో అందరూ కలిసి..

మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్(RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో

Viral Video: నాటు నాటు పాటకు క్రేజ్ మాములుగా లేదుగా.. పెళ్లి రిసెప్షన్‌లో అందరూ కలిసి..
Rrr
Follow us
Rajitha Chanti

| Edited By: Phani CH

Updated on: Jan 17, 2022 | 1:35 PM

మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్(RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR JR.) కలిసి నటించడంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏తో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా.. ఓమిక్రాన్, కరోనా ప్రభావంతో వాయిదా వేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చరణ్, తారక్ కలిసి చేసిన నాటు నాటు పాటకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇందులో చరణ్, తారక్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టెప్పులను వేస్తూ ఆ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఈ సిగ్నేచర్ స్టెప్ వీడియోస్ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నాటు నాటు పాటకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ పెళ్లి రిసెప్షన్ వేడుకలో వరుడితోపాటు.. అక్కడున్న బంధువులు చిన్న పిల్లలు.. యువకులు.. పెద్ద వారు అంతా కలిసి ఎంతో ఉత్సాహంతో నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

Also Read:

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?