పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మాత్రం ఆ రిస్క్ తీసుకోలేదు.. : ఉస్తాద్ డిస్టిబ్యూటర్

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’. భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మాత్రం ఆ రిస్క్ తీసుకోలేదు.. : ఉస్తాద్ డిస్టిబ్యూటర్
Ustaad Bhagat Singh

Updated on: Mar 20, 2026 | 4:53 PM

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్న విధంగానే ఈ సినిమాకే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఉస్తాద్ కూడా అదే క్రేజ్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. కాగా ఉస్తాద్ టికెట్ రేట్ల గురించి నిర్మాత శశి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. తాజాగా మైత్రి నిర్మాతల్లో ఒకరైన శశి మాట్లాడుతూ.. ప్రభాస్ రాజా సాబ్ అప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి లేట్ అవ్వడానికి కారణం గవర్నమెంట్ నుంచి 5 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిని మేమే పుట్ అప్ చేయాల్సి వచ్చింది.. వాయిదా అడిగినా రాలేదు.. గురువారం అప్లై చేయడంతో గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్స్ రాలేదు..

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్  సినిమా విషయంలో మాత్రం ఆ రిస్క్ తీసుకోలేదు.. ఒక్కసారి దెబ్బ తింటాం ఓకే.. రెండోసారి ఛాన్స్ తీసుకోలేం. అందుకే ఉస్తాద్ విషయంలో రిస్క్ తీసుకోకుండా.. మండే ఈవెనింగే రేట్లు పెంచకూడదనే కాల్ తీసుకున్నాం.. దీనికి కూడా రేట్ల కోసం అప్లై చేసాం కానీ అదే ఫార్మాట్ ఉండటంతో రేట్లు పెంచలేదు. ఉస్తాద్ అప్పుడు కూడా రేట్లు పెంచుకోడానికి సుప్రీం కోర్టు వరకు వెళ్లాం.. అది కూడా మండే ఈవెనింగ్ వచ్చింది.. దాంతో రేట్లు పెంచలేదు అని అన్నారు.

ఇవి కూడా చదవండి

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us