వ‌ర్మ‌కు క‌రోనా పాజిటివ్..సంచ‌ల‌న ట్వీట్..

|

Apr 01, 2020 | 11:08 PM

వ‌ర్మ‌కు బ్రెయిన్ లో క‌రోనా పురుగు తిరుతున్న‌ట్లుంది. అందుకే ఈరోజు క‌రోనాపై ‘కనిపించని పురుగు’ అంటూ నాన్ సింక్ లో త‌నే రాసి పాడిన ఓ సాంగ్ రిలీజ్ చేసి..నెటిజ‌న్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. ఇప్పుడు మ‌రోసారి త‌న మార్క్ తింగ‌రి జోకుల‌తో చెల‌రేగిపోతున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా క‌రోనాని ఎలా క‌ట్ట‌డి చేయాల‌ని ఆలోచిస్తుంటే..వ‌ర్మ మాత్రం ఆ వైర‌స్ పైనే కుళ్లు జోకులు వేస్తున్నాడు. పురుగు సాంగ్ మంచి కిక్ ఇచ్చిందో ఏమో రాత్రి మ‌రో సంచ‌ల‌న ట్వీట్ […]

వ‌ర్మ‌కు క‌రోనా పాజిటివ్..సంచ‌ల‌న ట్వీట్..
Follow us on

వ‌ర్మ‌కు బ్రెయిన్ లో క‌రోనా పురుగు తిరుతున్న‌ట్లుంది. అందుకే ఈరోజు క‌రోనాపై ‘కనిపించని పురుగు’ అంటూ నాన్ సింక్ లో త‌నే రాసి పాడిన ఓ సాంగ్ రిలీజ్ చేసి..నెటిజ‌న్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. ఇప్పుడు మ‌రోసారి త‌న మార్క్ తింగ‌రి జోకుల‌తో చెల‌రేగిపోతున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా క‌రోనాని ఎలా క‌ట్ట‌డి చేయాల‌ని ఆలోచిస్తుంటే..వ‌ర్మ మాత్రం ఆ వైర‌స్ పైనే కుళ్లు జోకులు వేస్తున్నాడు.

పురుగు సాంగ్ మంచి కిక్ ఇచ్చిందో ఏమో రాత్రి మ‌రో సంచ‌ల‌న ట్వీట్ తో నెటిజ‌న్ల ముందు వాలిపోయాడు. ‘ఇప్పుడే మా డాక్టర్ నన్ను టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ నిర్ధారించారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో ముందుగా కొంద‌రు కంగారు ప‌డినా..త‌ర్వాత సీన్ అర్థ‌మ‌య్యి లైట్ తీసుకున్నారు. అయితే నెటిజన్లు ఊహించినట్టుగానే.. వ‌ర్మ యాజిటీజ్ బిహేవ్ చేశాడు. ‘ఇప్పుడే ఆ డాక్టర్ ఇది ఏప్రిల్ పూల్ జోక్ అని చెప్పాడు.. అది అతని తప్పు నాది కాదు’ అంటూ త‌న ప్ర‌స్తుత సినిమాల్లోలాగానే ఓ పేల‌ని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వొడ్కా దొరక్క వ‌ర్మ మాన‌సిక ప‌రిస్థితి కూడా క్షీణించింద‌ని..ఎర్ర‌గడ్డ‌కు త‌ర‌లించాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.