Thaman: “ఆ సినిమా కోసం నా బ్రెయిన్ పక్కన పెట్టి పనిచేస్తున్నా”.. తమన్ ఆసక్తికర కామెంట్స్

|

Oct 08, 2022 | 3:50 PM

కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్. చిన్న చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా తమన్ అలవైకుంఠపురం లో సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు.

Thaman: ఆ సినిమా కోసం నా బ్రెయిన్ పక్కన పెట్టి పనిచేస్తున్నా.. తమన్ ఆసక్తికర కామెంట్స్
Thaman
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు తమన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్. ఈ యంగ్ మ్యుజీషన్ సంగీతం అందించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్. చిన్న చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా తమన్ అలవైకుంఠపురం లో సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంగీతం అందించారు తమన్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే బోయపాటి , రామ్ పోతినేని కాంబినేషన్ లో రానున్న సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పుడు టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు తమన్ . తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు తమన్. రీ రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవల్ ఉంటుందని చెప్పుకొచ్చారు తమన్. ఇక ఈ సినిమాలో 7 పాటలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.

“మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే శంకర్ గారి సినిమా స్పాన్ వేరు. ఈ అయన సినిమాకు పనిచేయాలంటే పాత బ్రెయిన్స్ అన్నీ పక్కనపెట్టి ఇంకో బ్రెయిన్ తో పని చేయాలి. టెక్నీషియన్లు హార్డ్ డిస్కులు మార్చినట్లుగా.. నేను ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు నా హార్డ్ డిస్క్ ని మార్చుకుంటాను అని అన్నారు తమన్. శంకర్-చరణ్ సినిమా అనేది వేరే వరల్డ్. పాటలు రిలీజ్ అయినప్పుడు అది మీకే తెలుస్తుంది” అని తమన్  చెప్పుకొచ్చారు. తమన్ కామెంట్స్ తో ఇప్పుడు ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.