AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. Thaman: ఆ కుర్ర హీరో సినిమాకు నో చెప్పిన తమన్.. అసలు కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తమన్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

S. Thaman: ఆ కుర్ర హీరో సినిమాకు నో చెప్పిన తమన్.. అసలు కారణం ఏంటో తెలుసా..?
Thaman
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2021 | 4:33 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తమన్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మాస్ సాంగ్స్‌కు తమన్ పెట్టింది పేరు. అలాగే తమన్ అందించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది అనడంలో అతిశయక్తి లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్. అప్పటివరకు ఒకే మూసలో సంగీతం ఉంటుంది అంటూ విమర్శలు చేసిన వారికి త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత సినిమాతో సమాధానం చెప్పాడు తమన్. ఈ సినిమాలో అద్భుతమైన సంగీతాన్ని అందించి ఆకట్టుకుంది. అలాగే ఆతర్వాత మరో సారి త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమానే అల వైకుంఠపురంలో. ఈ సినిమాలో పాటలు ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తమన్ ఓ యంగ్ హీరో సినిమాకు నో చెప్పారట. ముందు కమిట్ అయినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాకవడంతో తప్పక సినిమానుంచి తప్పుకోవాల్సి వచ్చిందంట. ఆ యంగ్ హీరో ఎవరంటే..?

అక్కినేని కుర్ర హీరో అఖిల్ ప్రస్తుతం, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు గోపి మోహన్ సంగీతాన్ని అందించాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఎంజెంట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా రానుందట. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు అఖిల్. అయితే ఈ సినిమానుంచి తమన్ తప్పుకున్నాడని తెలుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ మూవీని వదులుకున్నాడట తమన్. ఇప్పుడు తమన్ ప్లేస్‌లోకి  హిప్ హాప్ తమిజాను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం అందించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.

Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!