Thaman: త‌మ‌న్ ఇంత‌వ‌రకూ ఈ టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చెయ్య‌లేక‌పోయాడు.. ఆ హీరో ఎవ‌రో క‌నిపెట్ట‌గ‌ల‌రా..?

|

May 29, 2021 | 3:34 PM

ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా... ఎంతమంది సూపర్ స్టార్లతో సినిమాలు చేసినా... మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి తీరని కోరిక ఒకటుంది. ప్రభాస్ తో మూవీ చేయాలని... ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు.

Thaman: త‌మ‌న్ ఇంత‌వ‌రకూ ఈ టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చెయ్య‌లేక‌పోయాడు.. ఆ హీరో ఎవ‌రో క‌నిపెట్ట‌గ‌ల‌రా..?
Thaman
Follow us on

ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా… ఎంతమంది సూపర్ స్టార్లతో సినిమాలు చేసినా… మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి తీరని కోరిక ఒకటుంది. ప్రభాస్ తో మూవీ చేయాలని… ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఆ గోల్డెన్ ఛాన్స్ రెండుసార్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నియర్ ఫ్యూచర్లోనైనా అది తీరబోతోందా? ఆ కాంబోని మనమెప్పుడు చూడబోతున్నాం? అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చి ఆల్ టైమ్ రికార్డ్స్ సొంతమయ్యేలా… ఐకాన్ స్టార్ ని ఖుషీలో ముంచెత్తారు తమన్. సూపర్ స్టార్ మహేష్ కి నిన్న, నేడు, రేపు కూడా ఖతర్నాక్ పాటలిస్తూనే వున్నారు. పవర్ స్టార్ తో సినిమా చేయాలన్న గోల్డెన్ డ్రీమ్ ని కూడా వకీల్ సాబ్ తో ఫుల్ ఫిల్ చేసుకున్నారు. కాకపోతే.. వీటన్నిటికీ మించి… ఇంకా ఏదో సాధించాల్సింది మిగిలే వుంది అంటున్నారు తమన్.

సాహో స్టార్ ప్రభాస్ తో మూవీ చేయాలన్న తపనతో ఉన్నారట తమన్. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్న ప్రభాస్.. నాన్ లోకల్ మ్యూజిక్ డైరెక్టర్ల మీదే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు చేతిలో వున్న నాలుగు భారీ సినిమాల బోర్డింగ్ లో తెలుగు సంగీత దర్శకుల ఊసే లేదు. ఆదిపురుష్ కి కీరవాణి మ్యూజిక్ ఇస్తారన్న మాటలే తప్ప.. కన్ఫర్మేషన్ లేదు. గతంలో రెబెల్ మూవీకి తమన్ పేరు అనుకున్నా.. తర్వాత పాటలన్నీ తానే తయారుచేసుకున్నారు డైరెక్టర్ రాఘవ లారెన్స్. సాహో మూవీక్కూడా ఆఖరి నిమిషంలో తమన్ పేరు మిస్సయింది. మళ్ళీ డార్లింగ్ ప్రభాస్ తమన్ వైపు ఎప్పుడు చూస్తారో తెలీదు. ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా.. తన ట్యూన్స్ తో డార్లింగ్ తో స్టెప్పులేయించాలన్న ఆశ మాత్రం ఆశగానే మిగిలిపోతోంది తమన్ కి.

Also Read: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా…? ఇదిగో క్లారిటీ

బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ