Akhanda : బాలయ్యకు హిట్ వస్తే.. అది ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్

|

Dec 04, 2021 | 7:51 AM

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌ హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది.

Akhanda : బాలయ్యకు హిట్ వస్తే.. అది ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్
Thaman
Follow us on

Akhanda : న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌ హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. అఖండ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో సినిమా చూసారు.. ఈ సినిమా భారీ విజయం సాధించడానికి తమన్ అందించిన సంగీతం కీలకం అని చూసిన ప్రతిఒక్కరు అంటున్నారు. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశారని అంటున్నారు. తమన్ మ్యూజిక్ కి థియేట్సర్ దద్దరిల్లుతున్నాయి.

తాజాగా తమన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.. ‘గత ఏడాది మార్చిలో ఈ కథ విన్నాను. అప్పటి నుంచి ఎలా చేయాలా? అని తెగ ఆలోచించాం అన్నారు. అఘోర, శివుడి గురించి రీసెర్చ్ చేశాం అని తమన్ అన్నారు. బోయపాటి గారు నేను చాలా కష్టపడ్డాం అన్నారు. ఈ సినిమాను మాస్ జాతర చేసేశారు. చాలా సంతోషంగా ఉంది. నందమూరి అభిమానులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. బాలయ్య గారికి హిట్ వస్తే.. అది ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే. దేవుడి వేషం వేస్తే సరిపోయేది రామారావు గారికే. ఆ తరువాత బాలయ్య గారికే ఆ వేషాలు సరిపోతాయి అన్నారు. అఖండను ఇంత అఖండమైన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఆ శివుడే మాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కడా తగ్గకూడదు. ఈ విజయంతో ఇంకా మున్ముందుకు వెళ్లాలి’ అని తమన్ చెప్పుకొచ్చాడు. ఇక తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?