ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసి రికార్డుకెక్కింది ఆర్ఆర్ఆర్ (RRR). అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై నెట్టింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఆస్కార్ విన్న సౌండ్ ఇంజినీర్ రసూప్ పూకుట్టి సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ఓ గే లవ్ స్టోరీ అంటూ ట్విట్టర్ ఖాతాలో అభ్యంతర కామెంట్స్ చేశారు. దీంతో అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. రసూల్ కామెంట్స్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అది తప్పు విషయమా ? అంటూ తనదైన శైలీలో కౌంటరిచ్చారు నిర్మాత శోభు యార్లగడ్డ.
మరోవైపు రసూల్ పూకుట్టి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో అతడిని ఏకిపారేస్తు్న్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం రసూల్ పూకుట్టి వాఖ్యలపై స్పందించారు. అప్పర్ కేసు, లోయర్ కేసు టైప్ చేయడంలో నేను చాలా బ్యాడ్.. కానీ ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేయడంలో తప్పు లేదు. అది రసూల్ పూకుట్టి కి కూడా వర్తిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. అలాగే… ప్రస్తుతం నాకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్, భీమ్ పాత్రలు కనిపించడం లేదు. కేవలం కిడ్నాప్ కు గురైన మల్లి కోసం జీవితాంతం ఎదురుచూసే తల్లి మాత్రమే నాకు కనిపిస్తుంది. నా కంటి చూపు ఇప్పుడు మెరుగయ్యింది అనుకుంటున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు కీరవాణి. ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
I am not able to see Ram and Bheem characters from RRR anymore?? ( who looked like having shared a special relationship). All I can see is a mother waiting for a life time for her daughter Malli who was abducted.
Hope my vision gets improved soon.— mmkeeravaani (@mmkeeravaani) July 5, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..