Kalyani Malik: అవకాశం ఇస్తానంటే ఆ డైరెక్టర్‌కి గొడ్డు చాకిరీ చేశాను.. బిర్యానీ ప్యాకెట్లు మోశాను..

సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ తాను ప్లేబ్యాక్ సింగర్‌గా మారడానికి వెనుక పడిన ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక దర్శకుడు తనను 2001లో ఒక పాట అవకాశం కోసం రోజు చాకిరి చేయించాడని.. అదొక పీడకల అని తెలిపాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Kalyani Malik: అవకాశం ఇస్తానంటే ఆ డైరెక్టర్‌కి గొడ్డు చాకిరీ చేశాను.. బిర్యానీ ప్యాకెట్లు మోశాను..
Kalyani Malik

Updated on: Jan 16, 2026 | 1:24 PM

సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ తన జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. కొంతమంది స్టార్ దర్శకులు తనను ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంపిక చేసే ముందు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని.. ఒక రకమైన టార్చర్ చూపించారని వెల్లడించాడు. ప్లేబ్యాక్ సింగర్‌గా మారాలనే తన ప్రయత్నం తన జీవితంలో అత్యంత డిప్రెస్సివ్ స్టేజి అని చెప్పాడు. 2001లో ఓ దర్శకుడు ఒక పాట అవకాశం కోసం తనను దాదాపు పనివాడిలా రోజువారీ చాకిరి చేయించాడని పేర్కొన్నాడు. ఉదయాన్నే బైక్‌పై ఆ దర్శకుడిని మాదాపూర్ నుంచి KBR పార్క్‌కు తీసుకువెళ్లి, ఆయన జాగింగ్ పూర్తయిన తర్వాత తిరిగి తీసుకురావడమే కాకుండా, తన స్క్రిప్ట్ పనులలో సహాయం చేయాల్సి వచ్చేది. మధ్యలో ఆయనకు బిర్యానీ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చానని తెలిపాడు.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

ఆ రోజుల్లో కళ్యాణి మాలిక్ బేగంపేటలోని చికోటి గార్డెన్స్ సమీపంలో పేయింగ్ గెస్ట్‌గా నెలకు రూ. 2200 అద్దె చెల్లిస్తూ ఉండేవాడట. మధ్యాహ్న భోజనం మాత్రమే చేసేవాడట. ఆ సమయంలో స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, ఆ బాధను తట్టుకుంటూ, ఉదయాన్నే లేచి మాదాపూర్ వెళ్లి, ఆ దర్శకుడిని KBR పార్క్‌కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి స్నానం చేసి మళ్లీ ఆయన్ను కలవడానికి వెళ్లేవాడట. ఈ కష్టాలన్నీ కేవలం ఒక పాట అవకాశం కోసం అని అనుకుంటూ కష్టపడేవాడినని చెప్పాడు. ఒక రోజు తాను జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఆ విషయం దర్శకుడికి చెప్పలేదు. దర్శకుడు ఫోన్ చేసి ‘కళ్యాణ్ ఎక్కడ ఉన్నావ్? కూకట్‌పల్లిలోని ఘుమఘుమల నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను, నువ్వు తీసుకొచ్చి ఇవ్వు’ అని అన్నాడు. ఈ సంఘటన కళ్యాణి మాలిక్‌కు అత్యంత బాధను మిగిల్చిందట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..