Chakri: కసి, టాలెంట్ ఉంది కానీ అవకాశాలు రాలేదు.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చక్రి చివరి మాటలు

|

Feb 28, 2023 | 6:17 PM

మాస్ పాటలైనా.. మెలోడీలైనా .. ఇన్ స్ప్రెషనల్ సాంగ్స్ అయినా చక్రి సంగీతం అందించారంటే అవి చిరస్థాయిగా మిగిలిపోవాల్సిందే.. జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ

Chakri: కసి, టాలెంట్ ఉంది కానీ అవకాశాలు రాలేదు.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చక్రి చివరి మాటలు
Chakri
Follow us on

ఎన్నో అందమైన పాటలు.. అద్భుతమైన సంగీతం మనకు అందించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సంగీత దర్శకుడు చక్రి. సూపర్ హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ చక్రి. చిన్న వయసులోనే సినీ లోకాన్ని.. పాటల ప్రేమికులని విషాదంలోకి నెట్టి స్వర్గస్థులు అయ్యారు చక్రి. మాస్ పాటలైనా.. మెలోడీలైనా .. ఇన్ స్ప్రెషనల్ సాంగ్స్ అయినా చక్రి సంగీతం అందించారంటే అవి చిరస్థాయిగా మిగిలిపోవాల్సిందే.. జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ ఆయన అందించిన పాటలు జగమంతా గుర్తుంచుకునేలా ఉంటాయి. ఇక 2014 డిసెంబ‌ర్14 రాత్రి చక్రికి గుండెపోటు రావడంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో డిసెంబర్ 15 న తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే చక్రి ఆఖరి ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూరిజగన్నాథ్ తనకు సినిమా ఇండస్ట్రీలో తల్లి లాంటి వాడని అన్నారు చక్రి. అయితే ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ కూడా తెలిపారు చక్రి. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన చక్రి.. ఆ తర్వాత చిన్న సినిమాలకు సంగీతం అందించారు. పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు రాక చాలా కాలం ఎదురుచూశారు.

అదే సమయంలో  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సింహ సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకు చక్రి అందించిన సంగీతం ఒక హైలైట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్లు  వస్తాయి అని ఆశించాని కానీ మళ్లీ చిన్న సినిమాలే వచ్చాయి అన్నారు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించేది. కసి ఉంది టాలెంట్ ఉంది కానీ అవకాశాలు రావడం లేదు అని చాలా బాధపడ్డా.. ఆసమయంలో చాలా మంది చిన్న సినిమాలు చెయ్యొద్దు అన్నారు. నీ సంగీతం అడవి కాచిన వెన్నెల అవుతుందని అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు.. నేను చిన్న సినిమాలకు ఒకలా పెద్ద సినిమాలకు ఒకలా మ్యూజిక్ చేయను. నాకు తప్పకుండా పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయి. ఆ మ్యూజిక్ నాకు ఆ అవకాశాలు తెచ్చిపెడుతుంది అని అన్నారు చక్రి. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. నిజంగా ఆయనను, ఆయన పాటలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మిస్ అవుతారు.