Tollywood : ఆ హీరోను చూసి నా ప్రియుడు నన్ను వదిలేశాడు.. బ్రేకప్ స్టోరీ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తక్కువ సమయంలోనే సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ.. చిత్రాల కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ విషయాలతోనే పాపులర్ అయ్యింది. ఇటీవల ఆమె గురించి పలు విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Tollywood : ఆ హీరోను చూసి నా ప్రియుడు నన్ను వదిలేశాడు.. బ్రేకప్ స్టోరీ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
Mrunal Thakur

Updated on: Feb 19, 2026 | 12:35 PM

టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే నటిగా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తెలుగులో డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇదంతా పక్కన పెడితే కొన్నాళ్లుగా మృణాల్ పేరు వార్తలలో నిలుస్తుంది. హీరో ధనుష్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్ల చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఆ వార్తలను మృణాల్ ఖండించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన కెరీర్ మొదటి రోజులను గుర్తుచేసుకున్నారు మృణాల్. అలాగే తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

మృణాల్ మాట్లాడుతూ.. ” సినీరంగంలోకి వచ్చిన మొదట్లో ఎంతో ఆందోళనకు గురయ్యాను. బాలీవుడ్ ఇండస్ట్రీలో నేను అగ్ర హీరో సరసన నటిస్తున్నానని.. తనను ఎక్కడ విడిచిపెడతానో అని నా బాయ్ ఫ్రెండ్ భావించాడు. తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. జిమ్ కు వెళ్లి కండలు పెంచాడు. దాదాపు 20 కిలోల బరువు తగ్గాడు. కానీ కొన్ని రోజులకు మొత్తం మానేసి మళ్లీ బరువు పెరిగాడు. అతడి వింత ప్రవర్తనకు షాకయ్యాను. వెంటనే ఎందుకు అని అతడిని అడగ్గా.. నీ చుట్టూ ఉండే సినీతారలతో నేను పోటీపడాలనుకున్నా.. కానీ నావల్ల కావడం లేదు. అందుకే జిమ్ మానేశా” అని అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే మేమిద్దరం విడిపోయాం అని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడిన మృణాల్ తన గురించి వస్తున్న రూమర్స్ అవాస్తవమని అన్నారు. ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఎంత ఒత్తడికి గురవుతారో అతడిని చూశాకే తెలిసిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us