ఏడాది చివరలో ఊపేసింది..! ఈ అమ్మడి కోసం గూగుల్‌ల్లో తెగ గాలించేశారు..

ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త నేషనల్ క్ర‏ష్‏గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది ఈ హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది.

ఏడాది చివరలో ఊపేసింది..! ఈ అమ్మడి కోసం గూగుల్‌ల్లో తెగ గాలించేశారు..
Tollywood

Updated on: Dec 12, 2025 | 11:47 AM

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగాయి. ఊహించని విధంగా కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇంకొంతమంది విడాకులు తీసుకున్నారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డారు. అదేవిధంగా మరికొంతమంది భామలు స్టార్ డమ్ కూడా తెచ్చుకున్నారు. ఇటీవలే సమంత పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇటీవలే రాజ్ నిడమూరుని సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఓ హీరోయిన్ ఇండస్ట్రీని ఊపేసింది. గత ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన హీరోయిన్ ఈ అందాల భామ. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. పైగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన స్టార్ డమ్ తెచ్చుకుంది.

అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి కెరీర్ ను టర్న్ చేసింది. ఆ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఏడాది చివరిలో నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించారు ఆ అందాల భామ కోసం. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? చాల మంది హీరోయిన్ ఈ మధ్య ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు వారిలో ఈ అందాల భామ ఒకరు. ఆమె రుక్మిణి వసంత్..

కన్నడ ఇండస్ట్రీ వచ్చిన భామలు ఇప్పుడు టాలీవుడ్ లో రాణిస్తున్నారు వారిలో రుక్మిణి వసంత్ ఒకరు. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. ఈ సినిమాతోనే హీరోయిన్ గా అడుగుపెట్టింది రుక్మిణి. తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అందాల భామ. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ హీరోయిన్. ఈ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది రుక్మిణి. కాగా ఈ ఏడాది చివరిలో గూగుల్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన హీరోయిన్ గా నిలిచింది. imdb లిస్ట్ ప్రకారం ఈ అమ్మడిని ఎక్కువ మంది గూగుల్ లో గాలించారని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి