Most Eligible Bachelor: సక్సెస్ సంబరాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టీమ్.. గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు అక్కినేని అఖిల్. ఈ యంగ్ హీరో క ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాబ్‌లర్ సినిమాతో హిట్టు కొట్టి అంబరాన్ని అంటే సంబరాలు చేసుకుంటున్నాడు.
Most Eligible Bachelor: టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు అక్కినేని అఖిల్. ఈ యంగ్ హీరో క ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాబ్‌లర్ సినిమాతో హిట్టు కొట్టి అంబరాన్ని అంటే సంబరాలు చేసుకుంటున్నాడు. ఓ పక్క నాన్న కింగ్ నాగార్జున సినిమాలతో పోటీ… మరో పక్క, అన్న నాగ చైతన్య స్టార్ డమ్ ఢీ..! అయినా ఎక్కడా తగ్గకుండా తనకుంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు అక్కినేని అఖిల్. ఆ క్రేజ్ తోనే.. అక్కినేని లెగసీలో మోస్ట్ పాపులర్ అయ్యాడు. సినిమాలకు రాకముందే ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్లో అందర్నీ తన వైపుకు తిప్పుకున్నాడు.
ఇక తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గా మన ముందుకు రాబోతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్.. చాలా కాలం తరువాత ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అఖిల్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మెలీడీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతం అందించి సినిమాని సక్సెస్లో కీ రోల్ ప్లే చేశారు. ఇక అనౌన్స్ అయిన దగ్గర నుంచే అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా…మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైటిల్ రివీల్ తో అంచనాలను విపరీతంగా పెంచేసుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ను డైరెక్ట్ చేస్తుండడం.. అఖిల్, పూజా హెగ్డే కాంబో నటిస్తుండడంతో.. ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అందుకు తగ్గట్టే రిలీజైన నాటి నుంచి క్రేజీ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా సాంగ్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘మనసా మనసా’ సాంగ్ అందరి మనసే దోచుకుంది. ఇక గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకు సురేంద్ర క్రిష్ణ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్ ఆలపించారు.
‘మనసా’ సాంగ్ తరువాత ఈ సినిమా నుంచి రిలీజైన మరో సాంగ్ ‘గుచ్చే గులాబి లాగా’. ఈ సాంగ్ కూడా రిలీజైన రోజు నుంచే యూట్యూబ్లో అందర్నీ ఆకట్టుకుంటూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ , శ్రీమని సాహిత్యం అదించిన ఈ పాటను బాలివుడ్ సింగర్ అర్‌మాన్ మాలిక్ ఆలపించారు. ఆ తరువాత రిలీజైన ‘యే జిందగీ’ సాంగ్ కూడా నెట్టింట సూపర్ హిట్ గా నిలిచింది. జిందగీ స్టియరింగ్ మెలోడీ ఫర్ ఏ లాంగ్ డ్రైవ్ అంటూ అఖిల్ వాయిస్ ఓవర్ తో స్టార్ అయిన ఈ పాటను హనియా నాఫిసా, గోపీ సుందర్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘యే జిందగీ ‘ పాట తరువాత ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ‘లెహరాయి’. ఎట్ ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఈ పాట ఇప్పటికే 7.9 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఇక ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. శ్రీమణి సామిత్యం అందించారు. ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సెకండ్ వేవ్ తరువాత రిలీజైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.,.. అఖిల్ను మరో మెట్టు ఎక్కించింది. ఇక ఈ మూవీ ఇంత ఘనవిజయం సాధించినందుకు ఈ మూవీ టీం హైదరాబ్‌లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌కు తగ్గేదే లే అంటూ రీసెంట్ డేస్‌లో సందడి చేసిన అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేశారు.
పాన్ ఇండియా మూవీ పుష్ప తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్‌లో మన ముందుకు రానున్నారు. తన చిరకాల మిత్రుడు బన్నీ వాసు ప్రొడక్షన్ హౌస్‌లో ఈ సినిమా తెరకెక్కడం.. నవ యువ సామ్రాట్ అఖిల్ హీరోగా గ్రాండ్ సక్సెస్ కొట్టడంతో… అల్లు అర్జున్ ఈ మూవీ టీంను విష్ చేసేందుకు… వీరి వేడుకల్లో భాగస్వాయ్యం అయ్యేందుకు వస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. ఈ ఈవెంట్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కాస్ట్ అండ్ క్రూతో పాటు మరికొంత మంది టాలీ సెలబ్రిటీలు విచ్చేశారు.