AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal’s Marakkar: డిసెంబర్ 3న థియేటర్స్ పై పంజా విసరానున్న ‘అరేబియా సముద్ర సింహం’…

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.

Mohanlal’s Marakkar: డిసెంబర్ 3న థియేటర్స్ పై పంజా విసరానున్న 'అరేబియా సముద్ర సింహం'...
Mohanlal
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2021 | 9:50 AM

Share

Mohanlal’s Marakkar: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆయన తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ నటించారు. ఇదిలా ఉంటే మోహన్ లాల్ నటిస్తున్న భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహం అనేది క్యాప్షన్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు కానీ డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది.

మరక్కార్ సినిమా మీద మళయాలంలోనే కాకుండా తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రయదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం