Tollywood: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్న టాలీవుడ్ స్టార్ నటుడు.. అసలు విషయం తెలిసి షాక్.. వీడియో వైరల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో ఒకరైన ఈయన అభిరుచి గల నిర్మాత కూడా. అలాగే మంచి వ్యాపార వేత్త, విద్యా వేత్త. ఈ నటుడికి పలు పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. తాజాగా ఈ స్టార్ నటుడు న్యూజిలాండ్‌లో ఏడు వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Tollywood: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్న టాలీవుడ్ స్టార్ నటుడు.. అసలు విషయం తెలిసి షాక్.. వీడియో వైరల్
Tollywood Actor

Updated on: Jun 22, 2025 | 2:16 PM

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లలో చాలా మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు, అలాగే మరో ప్రముఖ నటుడు మురళీ మోహన్ లు ఇలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారు. వీరిని అనుసరించి చాలా మంది తెలుగు నటులు, నటీమణులు తమ సినిమా రెమ్యునరేషన్లను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారు. అందులో మోహన్ బాబు కూడా ఒకరు. సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా గొప్ప విజయాలు సాధించిన మోహన్ బాబు మంచి వ్యాపారవేత్త కూడా. ఆయనకు అనేక పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. కాగా మోహన్ బాబు నటించిన తాజా చిత్రం కన్నప్ప. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా షూటింగ్ చాలా భాగం న్యూజిలాండ్ లోనే జరిగింది. అయితే ఇప్పుడు మోహన్ బాబు అక్కడ కూడా భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారట. ఇందుకు సంబంధించి మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇందలో మోహన్‌బాబు.. ఓ సువిశాల మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే.. అంటాడు. ఈ వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్‌మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అంటాడు. దాంతో మోహన్‌బాబు.. మా దగ్గర బ్లాక్‌మనీయే లేదు. న్యూజిలాండ్‌లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్‌ చేస్తారు. ఇంతలో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మారుస్తాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా విదేశీయులకు న్యూజిలాండ్‌లో భూమి కొనడం అంత సులభం కాదు. అక్కడ భూమి కొనాలంటే కనీసం 12 నెలలుగా అక్కడ నివాసుముండాలి. అంతేకాదు ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ నుంచి అనుమతి పొందాలి. అయితే కొనుగోలుదారు సింగపూర్ లేదా ఆస్ట్రేలియా పౌరుడు అయితే ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది. కాగా ఇప్పుడు మోహన్ బాబు ఏడు వేల ఎకరాలు కొన్నట్లు వీడియోలో చెప్పారు. అయితే ఆయన ఫన్నీగానే ఈ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..