Mohan Babu: కుమారుడి కోసం రంగంలోకి దిగిన మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల కోసం సీనియర్లతో సంప్రదింపులు ?

MAA Elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది.

Mohan Babu: కుమారుడి కోసం రంగంలోకి దిగిన మోహన్ బాబు.. మా ఎన్నికల కోసం సీనియర్లతో సంప్రదింపులు ?
Mohan Babu

Updated on: Jun 22, 2021 | 12:21 PM

MAA Elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టేశారు. మా అద్యక్షుడి రేసులో హీరో మంచు విష్ణు, సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ఉన్నారు. వీరిద్ధరి మధ్య పోరు ఇప్పుడు రసవత్తరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తన కుమారుడి కోసం సీనియర్ హీరో మోహన్ బాబు రంగంలోకి దిగారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో కలిసి విష్ణుకు మద్ధతు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ కృష్ణను మోహన్ బాబు ఎందుకు కలిసారు అనే పూర్తి సమాచారం బయటకు రాకపోయిన.. వారిద్దరు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. మా అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరు, మోహన్ బాబుల మధ్య సన్నిహిత్యం బాగుండడం… వీరిద్ధరూ తరచూ కలుస్తున్నారు. అలాగే దే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మంచు లక్ష్మీ గతంలో కొన్ని విభాగాల బాధ్యతలను భుజానకెత్తుకుని సిన్సియర్ గా పనిచేశారు. ఆ రకంగా చూసినప్పుడు అత్యధిక శాతం మంది మంచు విష్ణు పక్షాన నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది. అటు బాలకృష్ణతో కూడా మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉంది.

Also Read: GHMC water bills: గ్రేటర్ వాసుల వాటర్ కష్టాలు.. భాగ్యనగరవాసుల దక్కని ఫ్రీ ఫలం.. ఐదింతల బిల్లుతో హడలిపోతున్న జనం

Karhika Deepam: మోనిత విషయం తనకు వదిలేయమన్న భాగ్యం.. గీతలు చెరిపి కార్తీక్ తలరాత మార్చే శక్తి దీపకే ఉందంటున్న సౌందర్య

Avika Gor: అతడు మా నాన్న కంటే చిన్నవాడు.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్.. ఆ నటుడితో రిలేషన్‏ను బయటపెట్టిన అవికా గోర్

Vasalamarri : సంబరపడిపోతోన్న వాసాలమర్రి.. అధినేత ఎంట్రీతో ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆనందం