Pragathi- Naga Babu: చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్.. నటి ప్రగతిపై ఎమ్మెల్సీ నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఏషియన్ ఛాంపియన్ షిప్‌లో సీనియర్ నటి ప్రగతి పతకాలు సాధించడం పట్ల ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రగతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు ప్రగతిని అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

Pragathi- Naga Babu: చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్.. నటి ప్రగతిపై ఎమ్మెల్సీ నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
Naga Babu, Pragathi

Updated on: Dec 11, 2025 | 8:09 PM

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో పతకాల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆమె ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. టర్కీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ప్రగతి ఒక బంగారు పతకంతో పాటు మూడు సిల్వర్ మెడల్స్ గెల్చుకుంది. దీంతో నటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రగతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు ప్రగతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చీరకట్టులో పవర్ లిఫ్టింగ్ చేయడం చూసి మొదట సరదా అనుకున్నానని, కానీ తన నిబద్ధత చూసి స్ఫూర్తి పొందానన్నారు.

‘ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌-2025లో” నాలుగు మెడల్స్ గెలుచుకున్న సినీ నటి శ్రీమతి ప్రగతి గారికి అభినందనలు. నటనతో పాటు పవర్ లిఫ్టింగ్‌లోనూ అంతర్జాతీయస్థాయిలో రాణించడం అనేకమందికి స్ఫూర్తిదాయకం. ప్రగతి గారు చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేయడం గతంలో ఒకసారి గమనించాను. ‘ఇదేంటి చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేస్తోంది, సరదాకేమో..” అనుకున్నాను. ఇంత నిబద్ధతగా ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తుందని ఊహించలేదు. వెండితెరపై మెప్పిస్తూ, క్రీడారంగంలోనూ రాణించడం విశేషం, చాలామంది మహిళలకు ఆదర్శం. ప్రగతి గారు సినిమాలతో పాటుగా పవర్‌ లిఫ్టింగ్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని’ అని నాగబాబు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

నాగబాబు ట్వీట్..

ప్రగతి సాధించిన మెడల్స్ తో జబర్దస్త్ రాం ప్రసాద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..