స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సోషల్ మీడియాలో అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్న మానిప్యులేషన్స్‌కు ఇదొక తీవ్ర హెచ్చరిక లాంటిదంటూ రష్మిక ఫేక్ వీడిమోపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్సీ కోరారు. తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాన్నారు. సైబర్ ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన తక్షణ అవసరం ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాలని కవిత కోరారు. రక్షణా చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మరో కేంద్ర మంత్రికి రాజీవ్ చంద్రశేఖర్‌కి ట్విట్టర్ వేదికగా కవిత విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అంశాలపై సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా కాంక్రీట్ చర్యలు కావాలంటూ కేంద్ర ప్రభుత్వంపై చురకలు వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. డీప్ ఫేక్ వీడియో విషయంలో తనకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపింది రష్మిక. కవిత ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ‘థ్యాంక్స్ మేడమ్’ అని తెలిపింది.
కాగా రష్మికకు సంబంధించిన ఈ అభ్యంతరకరమైన ఫేక్‌వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నకిలీ వీడియోలపై తక్షణమే చర్యలు చేపట్టాలంటూ నెటిజన్లు కూడా కోరుతున్నారు. ఇక రష్మిక కూడా ఈ మార్ఫింగ్ వీడియోపై భావోద్వేగానికి గురైంది. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటనలు కేవలం నాకు మాత్రమే కాకుండా, టెక్నాలజీ మిస్ యూజ్ కారణంగా బాధపడే వారందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రోజు నాకు మద్ధతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒకవేళ నేను స్కూల్ లేదా కాలేజీ వయసులో ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే ఎలా ఎదుర్కునేదాన్ని అనే ఊహకు కూడా రావడం లేదు. ఇలాంటి సంఘటనల పట్ల అందరిలో అవగాహన పెంచాల్సి అవసరం ఉంది’ అని తన ఆవేదనకు అక్షర రూప మిచ్చింది రష్మిక. అలాగే ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
Recent deepfake targeting Actor Rashmika Mandanna exposes the alarming ease of narrative manipulation online. Urgent action is needed to safeguard Indian women from cyber threats.
I appeal to Hon’ble President @rashtrapatibhvn, Hon’ble PM @narendramodi, Minister of Electronics…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 6, 2023
Thankyou for supporting @RaoKavitha ma’am. 🙏🏻 https://t.co/1LQ8tXeQbf
— Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..