అక్కినేని వారి ఇల్లాళ్లు ఎంత ల‌క్కీనో..!

అక్కినేని ఫ్యామిలీ తినాల‌నుకుంటే ఇండియాలోని గ్రేట్ కుక్స్ వారి ఇంటి ముందు వాలిపోతారు. కానీ ఎంత చేయి తిరిగిన‌వారు వంట‌ చేసినా..మ‌నం ఇంట్లో చేసుకున్న ఫుడ్ టేస్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ షూటింగ్స్ కి వెళ్లిన‌ప్పుడు కూడా ఇంటివ‌ద్ద నుంచి స‌తీమ‌ణి వండిన‌ భోజ‌నం తెప్పించుకుంటూ ఉంటారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో దీనికి పూర్తి రివ‌ర్స్ వ్య‌వ‌హారం ఉంటుంది. ఆ ఇంటి కోడ‌ళ్లు గ‌రిట ప‌ట్టిన సంద‌ర్భాలు చాలా అరుద‌నే చెప్పాలి. ఎందుకంటే […]

అక్కినేని వారి ఇల్లాళ్లు ఎంత ల‌క్కీనో..!

Updated on: Apr 15, 2020 | 10:07 AM

అక్కినేని ఫ్యామిలీ తినాల‌నుకుంటే ఇండియాలోని గ్రేట్ కుక్స్ వారి ఇంటి ముందు వాలిపోతారు. కానీ ఎంత చేయి తిరిగిన‌వారు వంట‌ చేసినా..మ‌నం ఇంట్లో చేసుకున్న ఫుడ్ టేస్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ షూటింగ్స్ కి వెళ్లిన‌ప్పుడు కూడా ఇంటివ‌ద్ద నుంచి స‌తీమ‌ణి వండిన‌ భోజ‌నం తెప్పించుకుంటూ ఉంటారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో దీనికి పూర్తి రివ‌ర్స్ వ్య‌వ‌హారం ఉంటుంది.

ఆ ఇంటి కోడ‌ళ్లు గ‌రిట ప‌ట్టిన సంద‌ర్భాలు చాలా అరుద‌నే చెప్పాలి. ఎందుకంటే నాగార్జున లాంటి గ్రేట్ చెఫ్
ఉండ‌గా..అమ‌లాకు వంట చెయ్యాల్సిన అవ‌సరం ఏముంది. ఈ విష‌యం ఆమే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇక త‌మ కోడ‌లు స‌మంత అస్స‌లు వంటచేయ‌ద‌ని తేల్చేశారు. ఇక నాగ్ లాగానే.. చైత‌న్య కూడా మంచి కుక్ అన్న సంగ‌తి స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌నికి వంట చేయ‌డం హాబీ కూడా. స‌మంత..భ‌ర్త చేసిన వంట‌ల‌ను టేస్ట్ చేసి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ విష‌యాన్ని స‌మంత ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా అక్కినేని వారి ఇల్లాల్లు ఎంత ల‌క్కీనో క‌దా..!