Mega Sankranti Records: సంక్రాంతి అంటే మెగాస్టార్‌ అడ్డా.. బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి సృష్టించిన పొంగల్ ప్రభంజనం ఇదే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద పండగ సంక్రాంతి. ఈ సమయంలో సినిమా విడుదల చేయడం అంటేనే అగ్నిపరీక్ష లాంటిది. ఎంతోమంది స్టార్ హీరోలు పోటీ పడే ఈ బరిలో ఒకే ఒక పేరు దశాబ్దాలుగా మారుమోగుతోంది. ఆ పేరు వింటేనే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది.

Mega Sankranti Records: సంక్రాంతి అంటే మెగాస్టార్‌ అడ్డా.. బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి సృష్టించిన పొంగల్ ప్రభంజనం ఇదే!
Msvpg1

Updated on: Jan 29, 2026 | 10:21 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫలితాలు ఎలా ఉన్నా సరే.. పండగ సీజన్‌లో ఆయన థియేటర్లోకి వస్తున్నారంటే రికార్డులు తిరగరాయాల్సిందే అని ట్రేడ్ వర్గాలు సైతం బల్లగుద్ది చెబుతాయి. తాజాగా 2026 సంక్రాంతి బరిలో దిగి తన కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన నటుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మొదలైన ఈ సంక్రాంతి సెంటిమెంట్ నేటికీ తగ్గలేదు సదా ఇంకా పెరుగుతూనే ఉంది. అసలు మెగాస్టార్ సంక్రాంతి హిస్టరీ ఏంటి? ఆయన ఖాతాలో ఉన్న టాప్ పొంగల్ హిట్స్ ఏవో చూద్దాం..

‘మన శంకరవరప్రసాద్’..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్’ ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 280 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరంజీవి కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా మరో హీరోగా నటించడం విశేషం. సుమారు రూ. 50 కోట్ల లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.

Mutamestri, Waltair Veerayya And Khaidi No 150

రీ ఎంట్రీ తర్వాత హ్యాట్రిక్..

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

  • ఖైదీ నంబర్ 150: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2017లో వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ రాబట్టి చిరంజీవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
  •  వాల్తేరు వీరయ్య: 2023లో బాబీ దర్శకత్వంలో రవితేజతో కలిసి చేసిన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
  •  దొంగ మొగుడు (1987): చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ఆయనకు దక్కిన మొదటి పూర్తి స్థాయి బ్లాక్ బస్టర్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులను తిరగరాసింది.
  • మంచి దొంగ (1988): రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పండగ సీజన్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది.
  • అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989): ఇది కేవలం హిట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మెగాస్టార్ ఇమేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చింది.
  • ముఠామేస్త్రి (1993): సంక్రాంతికి ఒక రోజు ఆలస్యంగా విడుదలైనా సరే, తన మాస్ పవర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

కేవలం మాస్ మాత్రమే కాదు, క్లాస్ ప్రేక్షకులను కూడా సంక్రాంతి బరిలో చిరంజీవి మెప్పించారు. 1997లో వచ్చిన ‘హిట్లర్’ ఆయన కెరీర్​కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 1999లో వచ్చిన ‘స్నేహం కోసం’ తండ్రీ కొడుకులుగా ఆయన నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. 2000లో వచ్చిన ‘అన్నయ్య’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ గా నిలిచి మంచి వసూళ్లు సాధించింది. చిరంజీవి సంక్రాంతి బరిలో దిగితే అది థియేటర్ల వద్ద జాతర లాగే ఉంటుంది. తన వైవిధ్యమైన నటనతో, డ్యాన్సులతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తాజా సక్సెస్‌తో ఆయన జోరు చూస్తుంటే మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.