మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోమవారం (ఆగస్ట్ 22న) 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యుల సమక్షంలో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఓ సామాన్య కుర్రాడు.. ఎన్నో అవమానాలు.. ఒడిదుడుకులను ఎదుర్కొని మెగాస్టార్ అయ్యాడు. ఎంతోమంది నటీనటులకు స్పూర్తిదాయకంగా నిలిచారు చిరు. మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు ఎందరో ఉన్నారు. చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని.. ఆయన చిత్రానికి దర్శకత్వం వహించాలనుకునే దర్శకులు, నటీనులు అనేకం. 1970లో కెరీర్ ఆరంభించిన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శక్తిగా నిలిచారు. 1980 వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. అయితే 1990లో అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్లలో చిరు ఒకరిగా నిలిచారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. చిరంజీవి పుట్టినరోజు ఆయనకు సంబంధించిన అలనాటి వార్తపత్రిక ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. అందులో చిరు పారితోషికం గురించి ప్రస్తావించారు.
1992 సెప్టెంబర్ 13న వెలువడిన ది వీక్ మ్యాగజైన్ అనే సంచికలో చిరు ఒక సినిమాకు రూ. 1.25 కోట్లు భారీ పారితోషికం తీసుకున్నారని తెలియజేస్తూ బచ్చన్ కంటే పెద్ద అంటూ పెద్ద అక్షరాలతో ట్యాగ్ లైన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. 1990లో చిరు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సెన్సెషన్ సృష్టించాడు. కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, అపద్భాంధవుడు, ముఠామేస్త్రీ వంటి చిత్రాలు చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి.
ట్వీట్..
CHIRANJEEVI born on this day pic.twitter.com/TQUcIbgfk1
— Film History Pics (@FilmHistoryPic) August 22, 2022
ప్రస్తుతం చిరు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.