
ప్రస్తుతం టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హను మాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వస్తోన్న చిత్రాల్లో బిగ్గెస్ట్ మూవీ ఇదే. ఇక ఇటీవల విడుదలైన హను మాన్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్లో అడియన్స్ అబ్బురపరిచిన అంశాల్లో ట్రైలర్ కట్ ఎండింగ్లో భజరంగ్ ఎంట్రీ షాట్ ఓ రేంజ్లో అనిపించింది. ముఖ్యంగా ట్రైలర్లో ఆ కళ్లు తెరిచే సన్నివేశం అయితే మరింత పవర్ఫుల్ గా అనిపించింది. అయితే ఇది చూసిన చాలామంది మెయిన్‌గా మెగా ఫ్యాన్స్‌లో అయితే ఈ పాత్రలో టాలీవుడ్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హను మాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నాడట. అయితే ఈ రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియలేదు. కానీ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో మాత్రం ఎక్కువగానే వినిపిస్తుంది. అయితే చిరు కుటుంబానికి హనుమంతుడు ఆరాధ్య దైవం అన్న సంగతి తెలిసిందే. గతంలో మంజునాథ సినిమాలో శివయ్య పాత్రలో కనిపించి మెప్పించారు చిరు. ఇప్పుడు హనుమాన్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
Hope you like it 😊https://t.co/9c7OzMUJ1O#JaiHanuman 🙏🏽 #HanuManTrailer
— Prasanth Varma (@PrasanthVarma) December 19, 2023
ప్రస్తుతానికి ఈ సినిమాలో హనుమాన్ పాత్రపై సస్పెన్స్ ఉంది. హనుమాన్ ఉంటే ఎవరు ఆ పాత్ర చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలని చెప్పేశాడు. అయితే ఈ సినిమాలో హనుమాన్ పాత్ర ఉందని మాత్రం తెలుస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలలో నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్ భాషలలోనూ విడుదల చేస్తున్నారు.
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/GepsB1tBUZ— Primeshow Entertainment (@Primeshowtweets) December 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.