Chiranjeevi: స్పీడ్ అందుకున్న మెగా రీమేక్స్.. శరవేగంగా మెగాస్టార్ నెక్స్ట్ పోజెక్ట్స్ షూటింగ్

ఆచార్య ఫైనల్ రిజల్ట్ ఏంటి.. కలెక్షన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి.. ఏయే రికార్డులు బద్దలవబోతున్నాయి... ఇలాంటి డీటెయిల్స్ నడుస్తున్నాయి. మెగా రీఎంట్రీ కోసం ఖతర్నాక్ సబ్జెక్ట్ కావాలంటూ అప్పట్లో తీవ్రమైన అన్వేషణ జరిపిన తర్వాతే ఖైదీ నంబర్ 150

Chiranjeevi: స్పీడ్ అందుకున్న మెగా రీమేక్స్.. శరవేగంగా మెగాస్టార్ నెక్స్ట్ పోజెక్ట్స్ షూటింగ్
Megastar

Updated on: May 01, 2022 | 12:59 PM

ఆచార్య ఫైనల్ రిజల్ట్ ఏంటి.. కలెక్షన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి.. ఏయే రికార్డులు బద్దలవబోతున్నాయి.. ఇలాంటి డీటెయిల్స్ నడుస్తున్నాయి. మెగా రీఎంట్రీ కోసం ఖతర్నాక్ సబ్జెక్ట్ కావాలంటూ అప్పట్లో తీవ్రమైన అన్వేషణ జరిపిన తర్వాతే ఖైదీ నంబర్ 150 కన్‌ఫమ్ అయింది. మాంచి మాస్ ఎలిమెంట్స్ ఉండే పవర్‌ఫుల్ మెసేజ్ ఉండే కత్తి సినిమా.. ఆల్రెడీ కోలీవుడ్‌ మార్కెట్‌లో భీకరంగా సత్తా చాటింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే రీమేక్ వైపు బెండ్ అయ్యారు చిరూ(Chiranjeevi). మంచి ఫలితం రాబట్టుకున్నారు కూడా. ఆ తర్వాతొచ్చిన సైరా.. మెగాస్టార్ మానసపుత్రిక. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తన సినిమా ద్వారా ప్రజలకు చెప్పాలని ఎప్పటినుంచో కల గన్నా.. అందుకే పాత తరం బయోపిక్ అయినా రిస్క్ చేశా అని ఓపెన్‌గా చెప్పారు చిరూ. ఆ వెంటనే.. 152వ సినిమాకు మాత్రం ఒరిజినల్‌ స్టోరీతో ముందుకెళ్లారు. కొరటాల చెప్పిన ధర్మస్థలి లైన్‌లో దమ్ముందని భావించి ధైర్యంగా సెట్స్ మీదికెళ్లారు.

ఒరిజినల్ స్టోరీయా లేక రీమేకా..? మెగాస్టార్‌కి ఏదైతే బెటర్ అనే చర్చ సీరియస్‌గా మొదలైందిప్పుడు. సరిగ్గా ఇక్కడే ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన ఖైదీ నంబర్‌ 150ని రీకాల్ చేసుకుంటున్నారు. నెయిబర్ మార్కెట్స్‌తో ఆల్రెడీ ప్రూవ్ అయిన స్టోరీలైన్స్‌ అయితే చిరూకు బాగా నప్పుతాయన్నది ఫ్యాన్స్ నుంచి వస్తున్న సలహా. ఇప్పటికైతే చిరూ లైనప్‌లో రెండు సాలిడ్ రీమేక్స్ రెడీగా ఉన్నాయి. తన ఫ్యాన్స్‌కు ఎటువంటి సినిమా ఐతే నచ్చుతుంది అనే విషయంలో మరింత క్లారిటీతో ఉన్నారు చిరూ. అందులో భాగంగానే.. తన లైనప్‌లో ఒక మేజర్ ఛేంజ్‌కి ప్రపోజ్ చేశారా..? ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చి అభిమానుల్ని ఫిదా చేయబోతున్నారా..? లూసీఫర్‌ నుంచి సోల్‌ని మాత్రమే తీసుకుని చేస్తున్న మూవీ గాడ్‌ఫాదర్‌. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కరెక్షన్స్‌ జరుగుతున్నాయి. కాస్టింగ్‌ విషయంలో కూడా డోస్ పెంచుతూ నయన్‌ అండ్ సల్మాన్‌ఖాన్‌ని లైన్లోకి తెచ్చారు డైరెక్టర్ మోహన్‌రాజా. మెహర్‌రమేష్‌ ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్న భోళాశంకర్ మీద కూడా బిగ్ హోప్సే ఉన్నాయి. కీర్తిసురేష్, తమన్నా ఇంక్లూడ్ కావడంతో భోళాశంకర్‌కి కమర్షియల్ వెయిటేజ్ పెరిగింది.

బాబీ డైరెక్షన్‌లో రాబోయే మెగా మూవీ మాత్రం పక్కా ఒరిజినల్ స్టోరీ. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల కూడా సొంత కథతోనే చిరూను ప్రసన్నం చేసుకున్నారు. వీటన్నిటి కంటే ముందు షార్ట్‌కట్‌లో బ్రోడాడీ అనే మలయాళీ మూవీ మెగా కన్సిడరేషన్‌లోకొచ్చేసింది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌ని హిలేరియస్ స్టయిల్‌లో ప్రజంట్ చేసిన బ్రోడాడీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు చిరూ. తోడుగా మేనల్లుడు సాయిధరమ్‌ని పరిశీలిస్తున్నారు. త్వరలో అనౌన్స్ అవుతుందని, సేమ్ టైటిల్‌తో అతిత్వరలో రాబోతోందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..